తొలి సినిమాతోనే ఎవరికీ దక్కనంత క్రేజ్ దక్కించుకున్నాడు అక్కినేని అఖిల్. ఇంత హైప్ పవన్ కళ్యాణ్(అప్పటికి కళ్యాణ్ బాబు.. అంతే), మహేష్ బాబు, రామ్ చరణ్ లను లాంఛింగ్ చేసినపుడు కూడా లేదనే మాట వాస్తవమే. అయితే.. తొలి సినిమాతో ఎవరూ అందుకోని డిజాస్టర్ ని కూడా అఖిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది మొత్తానికే అతి పెద్ద ఫ్లాప్ ఇచ్చిన హీరోగా మిగిలిపోయాడు. డ్యాన్సులు పర్లేదు కానీ.. యాక్టింగ్ లో ఇంకా రాటుదేలాల్సినది చాలానే ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి.
అసలు తన తొలి సినిమాగా ప్రపంచాన్ని కాపాడేసే సూపర్ హీరో పాత్ర ఎంచుకోవడమే అతి పెద్ద తప్పుగా ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఇదే మాటను నందమూరి నటసింహం బాలయ్య కూడా ఓ లెస్సర్ రూపంలో చెబుతున్నాడు. కొత్త హీరోల టాపిక్ వచ్చి అఖిల్ గురించి బాలకృష్ణ కామెంట్స్ చేశాడు. అందులోనే సలహాలు కూడా ఇచ్చేందుకు ట్రై చేశాడాయన. 'మొదట ఐదారు సినిమాలు ఎవరైనా సాధారణమైన హీరోగానే చేయాలి. ప్రేక్షకులతో మన అబ్బాయే అనుకునే రోల్స్ చేయడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మెల్లగా మాస్ ఫాలోయింగ్ ఎలాగూ వస్తుంది కాబట్టి.. అప్పుడు కాస్త ప్రయోగాలకు వెళ్లచ్చు. మొదటే సూపర్ హీరో పాత్రలంటే రిస్క్ ఎక్కువే ' అన్నారు బాలకృష్ణ.