బ్రాహ్మణుల కోసం బాలయ్య సింహం

Update: 2018-01-06 10:32 GMT
తెలుగు సినిమాల్లో చాలా సార్లే బ్రాహ్మణుల ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. వారి చుట్టూనే సినిమాను తిప్పే కథలు కూడా వచ్చాయి. ఏవో ఒకట్రెండు మినహాయిస్తే.. వీటిలో అధిక శాతం బ్రాహ్మణులను ఆటపట్టించేవో.. వారిని మూఢులుగా అభివర్ణించేవో వచ్చాయంతే.

అయితే.. నందమూరి బాలకృష్ణ మాత్రం కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారట. ఇప్పటివరకూ తెలుగు తెరపై బ్రాహ్మిన్స్ ను ఎవరూ చూపించని కోణంలో.. వారి గొప్పదనం గురించి ఎవరూ చెప్పని రీతిలో చూపనున్నారట బాలయ్య. ఈ నందమూరి హీరో నటించిన జైసింహా చిత్రం సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథ ప్రకార వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కుంభకోణంలో తెరకెక్కించారు. ఆ సీన్.. యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ అంటున్నారు. ఆ సన్నివేశం తర్వాత బాలకృష్ణ సుదీర్ఘమైన డైలాగ్స్ చెబుతారట. వేలాదిమంది బ్రాహ్మణులు చుట్టూ ఉండగా.. వారి గొప్పదనం గురించి బాలయ్య గ్రాంధికంలో వివరించే తీరు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ సినిమా రిలీజ్ తర్వాత.. బ్రాహ్మణులు అంతా బాలయ్య అభిమానులుగా మారిపోతారని.. ఫిలిం మేకర్స్ చెబుతున్నారంటే.. ఈ సన్నివేశంపై వారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్ధమవుతుంది. ఏమైనా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ బాలయ్య డైలాగులు చెబితే.. అవి కరెక్ట్ గా రీచ్ కాకుండా ఉండడం ఇప్పటివరకూ జరగలేదనే చెప్పాలి. మరి ఈ జైసింహా బ్రాహ్మణులపై చెప్పిన డైలాగ్స్ ఏంటో తెలియాలంటే.. రిలీజ్ వరకూ ఆగాల్సిందే.



Tags:    

Similar News