ఫస్ట్ కమర్షియల్ యాడ్ లో అదరగొట్టిన బాలయ్య..!

Update: 2022-10-28 06:39 GMT
నటసింహం నందమూరి బాలకృష్ణ తన మొట్టమొదటి బ్రాండ్ కమర్షియల్‌ తో అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్- 116 పారామౌంట్‌ కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్‌ గా మారాడు.

సాయి ప్రియా గ్రూప్ అనేది సౌత్ ఇండియాలోని కన్స్ట్రక్షన్ ప్లాటింగ్ సేవల సంస్థ. ఇది విభిన్న మార్కెట్ విభాగాలలో లీడింగ్ బిల్డర్ గా కొనసాగుతోంది. ఇప్పుడు వారు అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్‌ లకు సరిపోయేలా.. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణను తమ బ్రాండ్ ప్రచారకర్తగా నియమించుకున్నారు.

గురువారం రాత్రి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈవెంట్ లో 116 పారామౌంట్‌ కోసం బాలకృష్ణ నటించిన రెండు కమర్షియల్ యాడ్స్ ని నిర్వాహకులు విడుదల చేశారు. రెండు ప్రకటనల కాన్సెప్ట్‌ లు కూడా యునిక్ గా ఉన్నాయి. ఇందులో బాలయ్య రెండు విభిన్న గెటప్‌లలో మెరిసిపోయాడు. ఓవైపు సూట్‌ లో క్లాస్ అప్పియరెన్స్ ఇస్తూనే మరోవైపు కుర్తా పైజామాలో ట్రెడిషినల్ గా ఆకట్టుకున్నారు.

మొదటి యాడ్‌ లో బాలకృష్ణ రాయల్ అవతార్ లో కనిపిస్తుండగా.. రెండో యాడ్‌ లో సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించారు. రెండు కాన్సెప్ట్స్ అందరి దృష్టిని ఆకర్షించేవిగా ఉన్నాయి. భారతీయులకు సొంతిల్లు అనేది చాలా పెద్ద కల. మనం కలలు గనే ఇల్లు జీవితంలో ఒక్కసారే కట్టుకుంటాం. దాని వెనుక ఎన్నో భావోద్వేగాలు సెంటిమెంట్లు ఉంటాయి.

ఇప్పుడు బాలయ్య ప్రకటనల ద్వారా సొంతింటి కలను నిజం చేసుకోవడం గురించి తెలియజేయబడింది. ఇందులో బాలయ్య తన డైలాగ్ డెలివరీలో చాలా గ్రేస్‌ ఫుల్ మరియు ఎఫర్ట్‌ లెస్‌ గా ఉన్నాడు. ఈ యాడ్ లో అతని కూతురుగా బేబీ ఆదిశ్రీ గండ్ర కనిపించింది.

ఈ రెండు కమర్షియల్ యాడ్స్ కి ఆనంద్ గుర్రం కాన్సెప్ట్ అందిస్తూ.. దర్శకత్వం వహించారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. యశ్వంత్ నాగ్ సంగీతం సమకూర్చారు. శ్రేయాస్ మీడియా ఈ వాణిజ్య ప్రకటనలలో భాగమైంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ''హీరోలంతా వివిధ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తుంటే నేను బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఎందుకు చేయడం లేదని నా అభిమానులు ఆశ్చర్యపోయారు. నేను ఎప్పటికీ బ్రాండ్‌ లను ఆమోదించలేనని కూడా చాలామంది తేల్చారు. యాదృచ్ఛికంగా, భారతదేశంలో అత్యంత విజయవంతమైన టాక్ షో అయిన ఆహాలోని 'అన్‌ స్టాపబుల్' షోతో నేను ఓటీటీలో అరంగేట్రం చేసాను.

అల్లు అరవింద్‌ తో ఉన్న స్నేహం వల్లే చేశాను ఇప్పుడు నేను ప్రకటన ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాను. నేను తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు. నేను ఏదైనా నమ్మదగిన బ్రాండ్ అయితేనే సైన్ చేయాలని కోరుకున్నాను. సాయి ప్రియా గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నాను. నేను 'వీరసింహారెడ్డి' షూటింగ్‌ లో ఉన్నప్పుడు శ్రేయాస్ శ్రీనివాస్ నన్ను సంప్రదించి ఒప్పించారు'' అని అన్నారు.

హైదరాబాద్ శివార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులకు హ్యాట్సాఫ్. దేశంలోనే హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుంది. ఇది మెరుగైన మెట్రోపాలిటన్ నగరంగా మారుతోంది. జూబ్లీహిల్స్‌ లో నా ఇల్లు కట్టినప్పుడు, అప్పట్లో రోడ్లు లేవు కాబట్టి నాకే భయంగా ఉండేది. కానీ ఇప్పుడు అది నగరానికి కేంద్రంగా మారింది. మా ఇంటి డిజైన్ కోసం మా నాన్నగారు తన ఆలోచనలను అందించారు.

4000 ఎకరాలకు పైగా భూమిని అభివృద్ధి చేయడం ద్వారా సాయి ప్రియ తన మైలురాయిని సృష్టించింది. వీరికి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పటి వరకూ 36 ప్రాజెక్ట్‌ లను పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను అని బాలయ్య చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయికృష్ణ మాట్లాడుతూ.. "గత 26 ఏళ్లలో సాయి ప్రియా గ్రూప్ వివిధ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. అయితే, హైదరాబాద్‌ లో కొత్త ప్రాజెక్ట్ చాలా లగ్జరీగా ఉండాలని అనుకున్నాం. మేము ఇంతకు ముందు మా బ్రాండ్‌ ను ప్రచారం చేయలేదు.. నాకు బ్రాండ్ అంబాసిడర్ కూడా లేరు. మేము 'అఖండ' టైటిల్ స్పాన్సర్లం. ఆ సమయంలో, మేము అఖండ టీమ్‌ తో చర్చించాము. కాని బాలకృష్ణ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారా లేదా అని అనుకున్నాం.

కానీ బాలకృష్ణ గారి నుండి మాకు కాల్ వచ్చింది. మా కొత్త వెంచర్‌ ను ఆమోదించడానికి అంగీకరించారు. ఈ నెల 17న ఆయన్ను కలిశాను.. 26వ తేదీలోగా ప్రకటన సిద్ధంగా ఉంది. సపోర్ట్ చేసిన సాయి ప్రియ టీమ్ - శ్రేయాస్ మీడియా టీం మరియు డైరెక్టర్ ఆనంద్ గుర్రం కి ధన్యవాదాలు. బాలకృష్ణ గారి మనసు బంగారం. దేశం మొత్తంలో ఆయన ప్రోఫెషనలిజం మరియు క్రమశిక్షణను మ్యాచ్ చేసేవారు లేరు. ప్రసాద్ ఒక లెజెండ్ అయితే, బాలయ్య మరో లెజెండ్. ఇద్దరు లెజెండ్స్‌ కాంబినేషన్‌ లో రూపొందుతోందీ సాయి ప్రియ ప్రాజెక్ట్‌" అని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News