బాబోయ్‌ బాలయ్య 106 లోనూ అదే లుక్కా?

Update: 2019-12-06 11:41 GMT
బాలకృష్ణ 105వ సినిమా 'రూలర్‌' మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ఆ సినిమాలో బాలయ్య లుక్‌ పై రకరకాలుగా కామెంట్స్‌ వస్తున్న విషయం తెల్సిందే. బాలయ్య ఫ్యాన్స్‌ కూడా కొందరు బాలయ్య లుక్‌ విషయమై అసంతృప్తిగా ఉన్నట్లుగా సోషల్‌ మీడియా కామెంట్స్‌ చూస్తే అనిపిస్తుంది. బాలకృష్ణ ఆ గడ్డం ఏంటి బాబోయ్‌ అన్నట్లుగా కామెంట్స్‌ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన తదుపరి చిత్రంలో కూడా బాలయ్య అదే లుక్‌ తో కనిపించబోతున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బాలయ్య 106వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ప్రారంభోత్సవంకు బాలయ్య తన రూలర్‌ లుక్‌ తోనే వచ్చాడు. రూలర్‌ షూటింగ్‌ నుండి ఇటు వచ్చాడా లేదంటే ఈ సినిమాలో కూడా అదే తరహా లుక్‌ ను కంటిన్యూ చేయబోతున్నాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. బోయపాటి దర్శకత్వంలో గతంలో బాలయ్య చేసిన సింహా మరియు లెజెండ్‌ చిత్రాల్లో లుక్‌ తోనే సగం సక్సెస్‌ అయ్యారు. కాని ఇప్పుడు ఈ లుక్‌ తో చేస్తే మాత్రం ప్రేక్షకుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ దర్శకుడిని నెటిజన్స్‌ హెచ్చరిస్తున్నాడు.

సింహా మరియు లెజెండ్‌ సినిమాలను మించి ఉండేలా బాలయ్యకు సినిమా ఇవ్వడం తన బాధ్యత అన్న బోయపాటి లుక్‌ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఖచ్చితంగా ఇదే లుక్‌ ను కంటిన్యూ చేయడని చాలా మంది భావిస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభోత్సవంలో రూలర్‌ లుక్‌ తో పాల్గొనడంతో నెటిజన్స్‌ కాస్త టెన్షన్‌ పడుతున్నారు. బాబోయ్‌ మళ్లీ అదే లుక్కా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. అప్పుడు బాలయ్య అసలు లుక్‌ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News