బాబూ.. ఆ పెళ్ళికూతురు ఆమె కాదు!!!

Update: 2016-06-03 11:30 GMT
కనీసం ఏమి రాస్తున్నారో కూడా రీసెర్చ్ చేయకుండా రాసేస్తే.. పాపం ఇక్కడ హీరోయిన్లు ఫీలవుతున్నారు. ఇవాళ కొన్ని దక్షిణాది వార్తాపత్రికల్లో ఒక న్యూస్ వచ్చింది. ''చిన్నారి పెళ్ళికూతురు'' సీరియల్ ఫేం అవికా గోర్ ఇప్పుడు థాయ్ ల్యాండ్‌ లో హాలిడే ఎంజాయ్ చేస్తోందని.. అమ్మడు కూడా బుల్లితెరపై పార్వతి రోల్‌ చేసిన సోనారికా బడోరియా తరహాలో బికినీల్లో ఎంజాయ్‌ చేస్తోందంటో వార్తలు రాసేశారు.

కట్ చేస్తే.. అసలు అవికా గోర్ బ్యాంకాక్‌ వెళ్ళిందే లేదు. పైగా బికినీలు వేసిందే లేదు. అలాంటప్పుడు ఈ అమ్మడు బికినీల్లో మెరిసిందని మనోళ్ళు ఎలా రాశారబ్బా? అక్కడికే వస్తున్నాం. ప్రస్తుతం ''బాలికా వధు'' (సీరియల్‌ హిందీ వర్షన్‌)లో అవిక చేయట్లేదు. ఆమె స్థానంలో నేహా మర్దా అనే అమ్మాయి చేస్తోంది. ఈ భామ తన ప్రియుడితో కలసి బ్యాంకాక్‌ వెళ్ళింది. అక్కడ బికినీలు వేసుకొని ఫోజులిచ్చి అందరికీ షాకిచ్చింది. బాలికా వధు సీరియల్‌ ఇప్పుడు బికినీల్లో మెరుస్తోందని బాలీవుడ్‌ కాలమ్న్ లో న్యూస్‌ రావడంతో.. కనీసం ఆ వార్తను ఏ మాత్రం చదవకుండా మనోళ్ళు అవికా గోర్ అంటూ రాసిపాడేశారు.

నువ్వెప్పుడు బికినీ వేశావ్‌ బేబీ అంటూ చాలామంది తెలుగు ఫ్యాన్స్ ఆమెను అడగటంతో.. అసలు విషయం అర్ధంకాక ఆమె కూడా షాక్‌ తినేసింది అంతే.
Tags:    

Similar News