మహమ్మారి వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా విజృంభిస్తున్నా.. అన్ని రంగాల వారికి అంటుకున్నా తెలుగు సినీ పరిశ్రమ వారిని మాత్రం పలకరించలేదు. తాజాగా ఆ పని కూడా వైరస్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ లోకి ఆ వైరస్ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో నిర్మాత - నటుడు బండ్ల గణేశ్ కు వైరస్ సోకినట్టు తెలిసింది.
అనూహ్యంగా శుక్రవారం 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో ఒక్క హైదరాబాద్ నుంచే 329 ఉన్నాయి. ఆ వైరస్ సోకిన వారిలో బండ్ల గణేశ్ కూడా ఉన్నారని సినీ వర్గాల్లో టాక్. బండ్ల గణేశ్ కు పాజిటివ్ వచ్చిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ బండ్ల గణేశ్ కు వైరస్ సోకడం నిజమైతే సినీ పరిశ్రమలో వైరస్ సోకిన తొలి వ్యక్తే ఇతడే కావొచ్చు.
దశాబ్దాల నుంచి బండ్ల గణేశ్ సినీ పరిశ్రమలో ఉన్నారు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హాస్య నటుడిగా నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. గబ్బర్ సింగ్ - బాద్ షా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల్లో చేరి తనదైన శైలిలో రాజకీయాల్లోనూ నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ఇటీవల మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో ప్రేక్షకులను నవ్వించాడు. సినీ పరిశ్రమలో కొనసాగుతూనే పౌల్ట్రీ వ్యాపారం గణేశ్ నిర్వహిస్తున్నాడు.