ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మెగా కాంపౌండ్ హీరోలతో క్లోజ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే. నిన్న శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా బండ్ల గణేష్ మెగా హీరోలను కలిశాడు. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి తేజ్ - వైష్ణవ్ తేజ్ లను కలిసి పులగుచ్ఛాలు ఇచ్చి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఆ ఫొటోలను బండ్ల తన ట్విటర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై సినీ వర్గాల్లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. ప్రొడ్యూసర్ గా కాస్త గ్యాప్ తీసుకున్న బండ్ల గణేష్.. మళ్లీ నిర్మాతగా బిజీ అయ్యేందుకు బాగా కృషి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా హీరోతోనే నిర్మాతగా తన రీ-ఎంట్రీని ప్లాన్ చేసుకుని వారిని కలుస్తున్నారని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆ ఫోటోలలో అల్లు హీరోలతో కలిసినవి లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే తన బాస్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా ఉంటుందని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. పవన్ తోపాటు ఇతర మెగా హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు బండ్ల గణేష్ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న దిగిన ఫోటోలలో అల్లు కాంపౌండ్ హీరోలు మిస్ అయ్యారు. రామ్ చరణ్ - వరుణ్ తేజ్ లకు కరోనా సోకడంతో ఎవరినీ కలవడంలేదు. వారిని పక్కనపెడితే బండ్ల కేవలం మెగా హీరోలని మాత్రమే కలిసినట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ మెగా హీరోలకి మాత్రమే అడ్వాన్సులు ఇస్తున్నాడని.. ఈ విధంగా మెగా హీరోలకు దగ్గరగా అల్లు హీరోలకు దూరంగా ఉంటున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వాస్తవానికి బండ్ల గణేశ్ నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లో అల్లు అర్జున్ హీరోగా 'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమా చేసాడు. మరి ఇప్పుడు సినీ వర్గాల్లో అల్లు హీరోలకు ఆయన దూరంగా ఉంటున్నాడనే కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో!