రెండవ సారి కరోనా బారిన పడ్డ బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయ్యిందని ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు కాస్త సీరియస్ పరిస్థితి వెళ్లాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. అపోలో ఆసుపత్రిలో ఆయన్ను ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించారు. బండ్ల గణేష్ కు తక్కువ సమయంలోనే కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన తగ్గింది.
ఐసీయూలో చికిత్స పొందుతున్న బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయన్ను ప్రత్యేక రూమ్ కు మార్చినట్లుగా అపోలో వైధ్యులు చెబుతున్నారు. ఇంకా బండ్ల గణేష్ కరోనాతో బాధపడుతూనే ఉన్నారు. కాని పరిస్థితి మాత్రం నిలకడగా ఉందంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం కరోనా ట్రీట్‌మెంట్ ను బండ్ల గణేష్ కు అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. అపోలోలో మరి కొన్ని రోజుల పాటు బండ్ల గణేష్ ఉండాల్సి రావచ్చు అంటున్నారు. బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగు పడటంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఇటీవల వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు. అందులో పాల్గొన్న వారికి కొందరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వారితో పాటు బండ్ల గణేష్ కు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. పవన్ వేడుక కారణంగానే బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని ఎక్కువ మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సారి పవన్ నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఆ సినిమా కథ ను సెట్ చేసే పనిలో బండ్ల బాబు ఉన్నాడు. త్వరలోనే పవన్ తో బండ్ల గణేష్ సినిమా నిర్మించి తీరుతాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.