అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన ''బంగార్రాజు'' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. పండుగలాంటి సినిమా అంటూ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ విన్నర్ గా నిలిచింది. పోటీలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా సోగ్గాళ్లకు కలిసొచ్చింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికే కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీక్ లో బజ్ ఉన్న సినిమాలేవీ లేకపోవడంతో వారాంతంలో 'సోగ్గాడి చిన్నినాయనా' సీక్వెల్ హవానే కొనసాగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే 'బంగార్రాజు' సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతున్నా.. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రాంతాల్లో నంబర్స్ పరంగా వైరుధ్యం కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీ ఆంధ్రలో బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో అక్కినేని హీరోల సినిమా తక్కువ వసూలు చేస్తోందని తెలుస్తోంది.
ఏపీలో ఉన్న టికెట్ రేట్ల కారణంగా ఇటీవల విడుదలైన పెద్ద సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి నానా కష్టాలు పడ్డాయి. కానీ 'బంగార్రాజు' సినిమా అవే ధరలతో హౌస్ ఫుల్స్ తో అదిరిపోయే కలెక్షన్స్ నమోదు చేస్తోంది. మరోవైపు సొంతంగా రిలీజ్ చేసిన నైజాం మెయిన్ థియేటర్ లో కూడా తక్కువ నంబర్స్ వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా - రాయలసీమ జనాలంతా తమ స్వస్థలాలకు వెళ్లడం.. సిటీ అంతా ఖాళీ అవడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని అనుకున్నారు. కానీ సెలవులు అయిపోయి అందరూ నగరానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది.
'బంగార్రాజు' ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీతోనూ భారీ ఫిగర్స్ వస్తుండగా.. హైదరాబాద్ లో మాత్రం థియేటర్లు ఫుల్ అవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిరుచి ఎలా ఉన్నా తెలుగు ప్రేక్షకులు అందరూ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కలెక్షన్స్ లో పెద్దగా వైరుధ్యం ఏమీ ఉండదు. కానీ ఇక్కడ అది పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
సోషియో ఫాంటసీ ఔట్ అండ్ ఔట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'బంగార్రాజు' చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఆంధ్రా నేటివిటీకి తగ్గట్టుగా నాగార్జున - నాగచైతన్య పంచె కట్టు - గోదావరి స్లాంగ్ తో అలరించారు. ఇలాంటి అంశాలు ఆంధ్రా జనాలను ఆకర్షించి ఉంటాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు అక్కినేని సోగ్గాళ్ల సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఇతర చిత్రాల సందడి పెద్దగా లేకపోవడంతో.. ఈ వారాంతానికి నైజాంలోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.