థియేటర్లలో బంగార్రాజును మిస్సయినా నో ప్రాబ్లెమ్.. ఆయన రొమాంటిక్ వ్యవహారాల్ని ఓటీటీలో వీక్షించవచ్చు. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. ఎట్టకేలకు నిరీక్షణకు తెర దించుతూ బంగార్రాజు ను ఫిబ్రవరి 18 నుండి ZEE5లో ప్రసారం చేయబోతున్నారు.
థియేటర్లలో తప్పిపోయామని చింతించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ తెరపైనే బంగార్రాజుని వీక్షించవచ్చు. సంక్రాంతి సీజన్ లో అత్యంత పాపులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే.. అంటూ టీమ్ వెల్లడించింది.
మొత్తానికి కరోనా థర్డ్ వేవ్ భయాల నడుమ రిలీజైనా `బంగార్రాజు` సోలోగా ఇతర అగ్ర హీరోల నుంచి పోటీ లేకుండా బాగానే వసూల్ చేశాడు. ఓవైపు ఏపీలో టికెట్ రేట్లు పెంచేందుకు జగన్ ప్రభుత్వం ఆసక్తిగా లేకపోయినా తన సినిమా గట్టెక్కుతుందని పబ్లిగ్గానే ప్రకటించారు నాగ్. తన కాన్ఫిడెన్స్ ని బంగార్రాజు నిలబెట్టింది. మిశ్రమ స్పందనలకు అతీతంగా వసూళ్లను సాధించింది.
ఇంతలోనే బంగార్రాజు మూవీ ఓటీటీ ట్రీట్ కి రెడీ అయిపోతోంది. మరో రెండు రోజుల్లోనే జీ5లో రిలీజైపోతోంది. మరోవైపు ఫిబ్రవరి 25న పెద్ద తెరపై భీమ్లా నాయక్ విడుదలవుతుంటే అంతకుముందే ఓటీటీలో బంగర్రాజును వీక్షించే వీలుంది.
కింగ్ నెక్స్ట్ ఘోస్ట్..!
కింగ్ నాగార్జున `బంగార్రాజు` తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది `వైల్డ్ డాగ్` సక్సెస్ తో కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. విమర్శకుల ప్రశంలందుకన్న చిత్రంగా నిలిచింది. టాలీవుడ్ మొత్తం చిత్రాన్ని ఎంతో గొప్పగా ప్రశంచింది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `ది ఘోస్ట్` చిత్రంలో నటిస్తున్నారు.
దుబాయ్ లో తొలి షెడ్యూల్ తెరకెక్కుతోంది. అయితే ఇంతలో యూనిట్ సభ్యులు కరోనా బారిన పడటంతో కొంత గ్యాప్ వచ్చిందని సమాచారం. కొంత మందికి ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో షూటింగ్ షెడ్యూల్ ని అప్పట్లో తాత్కలికంగా వాయిదా వేసారు. ఇందులో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహాన్..గుల్ పనాగ్..అనిఖా సురేంద్రన్ నటిస్తున్నారు. ఇదొక ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం.
ఇప్పటికే నాగార్జున ప్రీ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. వర్షంలో కత్తిపట్టుకుని ఉన్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ లుక్ లో కింగ్ ఆద్యంతం ఆకట్టుకున్నారు. గతంలో నాగార్జున నటించిన `రాజుగారి గది-2` తో హారర్ జోనర్ ని టచ్ చేసారు. ఆ సినిమా కింగ్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.
మరోసారి ఫాంటసీ చిత్రంతో ప్రయత్నం చేస్తున్నారు. `ది ఘోస్ట్` చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, .. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కె నారంగ్,.. పుస్కూర్ రామ్ మోహన్ రావు,.. శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.