పాక్ - భార‌త్ క్రికెట‌ర్లు క‌లిసి ఆట‌కు రెడీ

Update: 2019-07-28 05:08 GMT
దాయాది దేశాలు అయిన భార‌త్ - పాకిస్తాన్ క్రికెట‌ర్లు క‌లిసి ఓ మ్యాచ్ లో ఆడ‌నున్నారు. ఈ మ్యాచ్‌ కు ఐసీసీ అధికారికంగా అంత‌ర్జాతీయ గుర్తింపు కూడా ఇవ్వ‌నుంది. ఈ రెండు దేశాల క్రికెట‌ర్లు క‌లిసి ఆసియా లెవ‌న్ త‌ర‌పున రెండు 20-20 మ్యాచ్‌ లు ఆడ‌నున్నారు. వ‌చ్చే యేడాది మార్చి 18 - 21వ తేదీల్లో ఆసియా లెవెన్ వ‌ర్సెస్ వ‌ర‌ల్డ్ లెవ‌న్ మ‌ధ్య ఈ రెండు టీ 20 మ్యాచ్‌ లు జ‌రుగుతాయి. బంగ్లాదేశ్‌ ను కనుగొన్న షేక్ ముజిబుర్ రహ్మన్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని బంగ్లా రాజ‌ధాని ఢాకాలో ఈ మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరింది. వాస్త‌వంగా పూర్తిస్థాయి ఐసీసీ స‌భ్యులుగా ఉన్న టీం ఆడే మ్యాచ్‌ ల‌కు మాత్ర‌మే ఐసీసీ గుర్తింపు ఇస్తుంది. అయితే బంగ్లాదేశ్‌ ను క‌నుకున్న షేక్ ముజిబుర్ రెహ్మ‌న్ స్మార్థ‌కార్థం జ‌రుగుతున్న మ్యాచ్‌ లు కావ‌డం... బంగ్లా అభ్య‌ర్థ‌న మేర‌కు వీటికి ఐసీసీ అంత‌ర్జాతీయ మ్యాచ్‌ లుగా గుర్తించ‌నుంది.

గతంలో ఆఫ్రికా ఎక్స్‌ ఐ - ఆసియా ఎక్స్‌ ఐ మధ్య మ్యాచ్‌ జరిగింది. చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఈ మ్యాచ్‌ లో పాల్గొన్నారు. ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఆసియా జ‌ట్ల‌కు చెందిన క్రికెట‌ర్ల‌ను ఒకే జ‌ట్టులో చూడ‌బోతున్నాం. ఆసియా స్టార్ క్రికెట‌ర్లు వ‌ర్సెస్ వ‌ర‌ల్డ్‌ లోని మిగిలిన దేశాల క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.  2007లో జరిగిన ఆఫ్రికా లెవెన్‌ - ఆసియా లెవెన్‌ మ్యాచుల్లో పాకిస్థాన్ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ లో కూడా బంగ్లా విజ్ఞ‌ప్తి మేర‌కు ఆసియా లెవెన్‌ లో పాక్‌ - భార‌త్‌ - బంగ్లా - లంక - అప్ఘ‌నిస్తాన్ క్రికెట‌ర్లు క‌లిసి ఆడ‌నున్నారు.
 
Tags:    

Similar News