ఓవర్సీస్ లో రెండో రోజే చేతులెత్తేసిన 'బీస్ట్'

Update: 2022-04-15 16:30 GMT
కరోనా పాండమిక్ తర్వాత ఓవర్ సీస్ మార్కెట్ ఎప్పటిలాగే పుంజుకుంది. ఇటీవల కాలంలో విడుదలైన అనేక భారతీయ చిత్రాలు సాలిడ్ కలెక్షన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాయి. ఇప్పుడు లేటెస్టుగా 'బీస్ట్' 'కేజీఎఫ్: చాప్టర్ 2' వంటి రెండు భారీ చిత్రాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి.

దళపతి విజయ్ - పూజాహెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బీస్ట్' మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఫస్ట్ డే తమిళనాడులో మంచి ప్రదర్శన కనబరిచిన ఈ సినిమా.. యూకే - సింగపూర్ - మలేషియా - యూరోప్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

విజయ్ కి నార్త్ అమెరికాలో బలమైన మార్కెట్ లేనప్పటికీ, యూఎస్ఏలో 'బీస్ట్' మూవీ ఓపెనింగ్ డే నాడు $850K కలెక్షన్స్ సాధించింది. అయితే తొలి రోజు నెగెటివ్ టాక్ రావడం.. రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో రెండో రోజు నుంచి వసూళ్ళు డ్రాప్ అయ్యాయి. యూఎస్ లో ఈ సినిమా రెండవ రోజు దాదాపు $101K గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'బీస్ట్' మూవీ అమెరికాలో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడానికి దాదాపు $1.5 మిలియన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత భారీ డ్రాప్ తర్వాత విదేశీ మార్కెట్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రాబోయే రోజుల్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు.

ఇక మరుసటి రోజు రిలీజైన 'కేజీయఫ్ 2' సినిమా కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఓవర్ సీస్ లో అంత గొప్పగా ఏమీ చేయడం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కాకపోతే యూఎస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న కన్నడ సినిమాగా నిలుస్తుందని అంటున్నారు.

ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేసిన 'కేజీఎఫ్ 2' మేకర్స్.. ఓవర్సీస్ వసూళ్ళు ఎంతో వెల్లడించలేదు. నార్త్ మరియు కర్ణాటక మార్కెట్ లలో మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు వారాల రన్ కంప్లీట్ చేసుకున్న RRR మూవీ.. చాప్టర్-2 కు అన్ని చోట్లా ఇంకా పోటీనిస్తోంది.
Tags:    

Similar News