బ్యూటీ విత్ టాలెంట్.. లైగర్ భామ షైనింగ్..

Update: 2022-10-22 04:44 GMT
బాలీవుడ్ అందాల భామ అనన్యా పాండే ఇటీవలే రౌడీ బోయ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పాన్ ఇండియా రిలీజైంది. సినిమా అంచనాలకు తగినట్టుగా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అనన్యా పాండే కూడా సినిమా రిజల్ట్ తో డీలా పడ్డది.

లైగర్ తో సౌత్ లో సత్తా చాటాలని అనుకున్న అమ్మడికి సినిమా ఫెయిల్యూర్ షాక్ ఇచ్చింది. అంతేకాదు లైగర్ హిట్ కొడితే తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనుకున్న ఆలోచనలకు బ్రేక్ పడేలా చేసింది.  స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన అనన్యా పాండే చేసిన మూడు నాలుగు సినిమాలకే బ్యూటీ విత్ టాలెంట్ అనిపించుకుంది.       

లైగర్ సూపర్ హిట్ అయితే ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడం అమ్మడికి తెలుగులో మరో ఛాన్స్ రాకుండా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కో గయే హమ్ కహన్, డ్రీం గర్ల్ 2 సినిమాల్లో నటిస్తుంది అనన్యా పాండే. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు అమ్మడు ఓకే అనేస్తుంది. గెహ్రాయాన్ వెబ్ సీరీస్ లో దీపీకా పదుకొనేకి పోటీగా అనన్యా పాండే నటనతోనూ అందంతోనూ మెప్పించింది. సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది అనన్యా పాండే.

లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ కలర్ ట్రెండీ వేర్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. బాలీవుడ్ లో హెవీ కాంపిటీషన్ ఉన్నా సరే స్టార్ రేంజ్ కి వెళ్లే అన్ని క్వాలిటీస్ ఉన్న అనన్యాలో ఉన్నాయని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే కాకుండా డిఫరెంట్ స్టోరీస్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యింది అనన్యా పాండే.

లైగర్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. తన స్టైల్ అండ్ లుక్స్ తో బాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ బ్యూటీగా అనన్యా పాండే తన సత్తా చాటుతుంది. ఇదే జోష్ తో అమన్యా తన సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించాలని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News