నెలకు ₹ 3.5 లక్షల అద్దెకు బెబో ఇల్లు

Update: 2021-08-17 12:30 GMT
సైఫ్ అలీ ఖాన్- క‌రీనా క‌పూర్ జోడీ (సైఫీనా) తన పాత ఇంటి స‌ముదాయాన్ని నెలకు ₹ 3.5 లక్షలకు అద్దెకు ఇచ్చార‌ని సమాచారం. ఈ ఇంటిలో సైఫీనా జంట త‌మ కుమారుడు తైమూర్ తో కలిసి ఏడాది ప్రారంభంలో నివసించారు. ఇప్పుడు ఇందులోకి వేరొక‌రు నివాసానికి దిగుతున్నారు. ముంబైలోని ఫార్చ్యూన్ హైట్స్ లో ఈ పాత ఇల్లు ఉంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో సైఫీనా కుటుంబం ఒక పెద్ద ఇంటికి మారడంతో పాత ఇంటిని ఖాళీగా ఉంచ‌కుండా అద్దెకు ఇచ్చారు. తాజా స‌మాచారం మేర‌కు.. సైఫ్‌ అలీ ఖాన్ అసోసియేషన్ మీడియా ఎల్‌.ఎల్‌.పి ద్వారా గిల్టీ అనే సంస్థకు ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు ఇండెక్స్‌టాప్.కామ్ లో న‌మోదైంది. అద్దె ఒప్పంద పత్రం ఈ వెబ్ సైట్ తో యాక్సెస్ చేసారు. వారు రూ. 15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. ఈ అపార్ట్ మెంట్ 1500 చదరపు అడుగుల విస్తీర్ణం క‌లిగి ఉంది. రెండు కార్ల పార్కింగ్ స్థలాలు ఉన్నాయి.

ఈ ఇంటిని మూడు సంవత్సరాల కాలానికి అద్దెకు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో అద్దె నెలకు రూ. 3.5 లక్షలు.. రెండవ మూడవ సంవత్సరంలో వరుసగా రూ. 3.67 లక్షలు రూ. 3.87 లక్షల వరకు ఉంటుంది. అపార్ట్ మెంట్ మూలధన విలువ రూ. 12 - 14 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం.

కరీనా -సైఫ్ త‌మ‌ కుమారులు తైమూర్ - జెహ్ ల‌తో విహారయాత్ర కోసం మాల్దీవులకు బయలుదేరడానికి రెండు రోజుల ముందు 13 ఆగష్టు 2021 న ఒప్పందంపై సంతకం చేసారు. ఇక క‌రీనా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అమీర్ తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దాలో న‌టిస్తుండ‌గా సైఫ్ ఆదిపురుష్ 3డి స‌హా ప‌లు భారీ చిత్రాలు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News