నాన్న ఫైన‌ల్ చేశాకే క‌థ వింటాడ‌ట‌

Update: 2020-01-03 05:50 GMT
నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు శ్రీనివాస్ కెరీర్ న‌డ‌క గురించి తెలిసిందే. మిడ్ రేంజ్ సినిమాల‌తో అత‌డు బాక్సాఫీస్ పోరాటం సాగిస్తున్నాడు. స్టార్ హీరోయిన్లు.. టాప్ కాస్టింగ్ తో సేఫ్ జోన్ అత‌డి స్టైల్. నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో ప్ర‌యోగాలు చేస్తున్నాడు. న‌టుడిగా ఇంకా పూర్తి స్థాయి లో రాణించాల్సి ఉంది. ఇటీవ‌లే కొన్ని వ‌రుస ప్లాప్ ల త‌ర్వాత రాక్ష‌సుడు చిత్రంతో హిట్ అందుకున్నాడు. న‌టుడిగానూ పేరొచ్చింది... నిర్మాత సేఫ్ జోన్ కి చేర్చిన‌ సినిమాగా నిలిచింది. ఇక జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న హీరోగానూ అత‌డికి గుర్తింపు ఉంది. ప్ర‌స్తుతానికి సేఫ్ జోన్ లో ఉన్నాడు. అవ‌కాశాలకు కొద‌వేమీ లేదు.

డాడ్ బెల్ల‌కొండ స‌హ‌కారంతో కొన్నాళ్లు కెరీర్‌ప‌రంగా ఢోఖా లేదు. ఇక సోద‌రుడు బెల్ల‌కొండ గ‌ణేష్ కూడా హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. అయితే శుక్ర‌వారం శ్రీనివాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని మీడియాతో పంచుకున్నాడు. ప్ర‌తి క‌థ‌ను ముందుగా త‌న తండ్రి సురేష్ వింటారుట‌. ఆయ‌నకు న‌చ్చితేనే త‌న వ‌ద్ద‌కు వ‌స్తుందిట‌. లేదంటే అక్క‌డ నుంచి రైట‌ర్ వెన‌క్కి వెళ్లిపోవాల్సిందే. మ‌రి మీకంటూ సొంత నిర్ణ‌యాలు ఉండావా? ఆ క‌థ మీకు న‌చ్చొచ్చు క‌థా? అంటే స‌రైన స్ప‌ష్ట‌త లేని స‌మాధాన‌మే ఇచ్చాడు.

నాన్న‌కి సినిమా ఇండ‌స్ట్రీపై అపార అనుభ‌వం ఉంది. క‌థ‌ల విష‌యంలో నాన్న‌ నిర్ణ‌యాలే మంచి చేస్తాయ‌ని భావించి...ఆయ‌న మాట‌కే ప్రాధాత‌న్యతను ఇస్తాన‌ని తెలిపాడు. ఆ విష‌యం ప‌క్క‌న‌బెడితే గ‌తంలో శ్రీనివాస్ తండ్రి మాట‌ను పెడ చెవిన పెట్టి సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుని త‌న‌కు న‌చ్చిన‌ క‌థ‌లతో సినిమాలు చేస్తున్నాడ‌ని క‌థ‌నాలు వెడెక్కించిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `సీత` క‌థ తండ్రికి న‌చ్చ‌క‌ పోయినా...శ్రీనివాస్ తేజ పై న‌మ్మ‌కం తో చేసాడ‌ని..కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డం తో తిరిగి తండ్రి గారి దారి లోకి వెళ్లి పోయాడ‌ని భావిస్తున్నారంతా.


Tags:    

Similar News