యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో తెరంగేట్రం చేస్తున్నసంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని వి.వి. వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాప్రారంభమై చాలా కాలమవుతుంది. అయితే షూట్ ప్రారంభమైన దగ్గర నుంచి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అసలు ఈ సినిమా చేస్తున్నారా? లేదా? అని నెట్టింట ప్రచారం సాగింది.
చివరికి కొన్ని నెలలుగా ఎలాంటి ప్రచారం కూడా కనిపించలేదు. తాజాగా ఈసినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ అందుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తిచేసుకుని తొలికాపీ కూడా సిద్దమైందిట. కానీ విడుదల విషయంలో మీమాంస కొనసాగుతుంది. ముందుగా భారీ ఎత్తున థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారుట.
కానీ ఇప్పుడా ఆలోచన విరమించుకున్నట్లు కనిపిస్తుంది. అసలు రిలీజ్ చేయాలా? వద్దా? అన్న దగ్గర బ్రేక్ పడుతుంది.
థియేటర్ రిలీజ్ అయితే ఉత్తరాదిన పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలి. పైగా సాయి శ్రీనివాస్ డెబ్యూ కాబట్టి ప్రచారంపై దృష్టి పెట్టాలి. అందకు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అక్కడ థియేటర్ రిలీజ్ కూడా కఠినమైనదే.
ఖర్చు చేసినా తర్వాత సరైన రిలీజ్ కుదరకపోతే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే. దీంతో దాదాపు థియేటర్ రిలీజ్ ఉండే అవకాశం లేదని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ బిజినెస్ లేనట్లుగానే చెప్పొచ్చు. దీంతో ఓటీటీ రిలీజ్ కి వెళ్లే అవకాశం ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఓటీటీ రిలీజ్ అయితే పెద్దగా ఖర్చు కు అవకాశం ఉండదని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పైగా ఇటీవలి కాలంలో హిందీ సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. వాటి సక్సెస్ రేటు కూడా బాగుంటుంది. ఇక్కడ ప్రచారానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానూ పెన్ స్టూడియోస్ ఓటీటీ రిలీజ్ కు వెళ్లే అవకాశం ఉంది. మరి తుదిగా 'ఛత్రపతి' రీమేక్ ఎలా ప్రేక్షకుల ముందుకొస్తుంది! అన్నది మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.