టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన 'ఛత్రపతి' సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు ప్రభాస్ పోషించిన పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి రెడీ అయ్యాడు సాయి శ్రీనివాస్. దీనికి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. 'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ ను హీరోగా లాంచ్ చేసిన డైరెక్టర్ వినాయక్.. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో లాంచ్ చేసే బాధ్యత తీసుకోవడం గమనార్హం. రాజమౌళి తండ్రి, 'ఛత్రపతి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ రీమేక్ చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ని ఏప్రిల్ 22 నుండి ప్రారంభించాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 6 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్ల వ్యయంతో ఓ భారీ విలేజ్ సెట్ కూడా నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు పర్యవేక్షణలో 'రంగస్థలం' సినిమా విలేజ్ సెట్ వేసిన ప్రదేశంలో ఏర్పాటు చేయడం గమనార్హం. దురదృష్టవశాత్తు, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం - లాక్ డౌన్ కారణాలతో షూటింగ్ రద్దు చేయబడింది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే 'ఛత్రపతి' హిందీ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా.. ఈసారి వర్షం రూపంలో నష్టం వాటిల్లింది.
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 'ఛత్రపతి' సెట్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సెట్ కు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. సినిమా షూట్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు సెట్ పునర్నిర్మాణం చేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, యాక్షన్ ప్యాక్డ్ పాత్రను పోషించడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. బాలీవుడ్ డెబ్యూ కోసం భారీ వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేశాడు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో రూపొందించనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.