శీనూకి అంత వ‌సూలు చేసే సీనుందా?

Update: 2019-08-01 08:04 GMT
కిడ్న‌ప్- క్రైమ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా రాక్షసుడు. బెల్లంకొండ శ్రీ‌ను పోలీసాఫీస‌ర్ గా న‌టించ‌గా.. అనుప‌మ స్కూల్ టీచ‌ర్ గా న‌టించారు. ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. హ‌వీష్- కోనేరు స‌త్యానారాయ‌ణ నిర్మాత‌లు. టీనేజ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కిరాత‌కంగా చంపే సైకో క‌థ‌తో తెర‌కెక్కింది. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ రాక్ష‌స‌న్ కి రీమేక్ చిత్ర‌మిది.

టీజ‌ర్.. ట్రైల‌ర్ నుంచే ఆస‌క్తి పెరిగింది. ఈ శుక్ర‌వారం ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం బెల్లంకొండకు హిట్టిస్తుందా?  వ‌రుస వైఫ‌ల్యాల నుంచి అత‌డిని బ‌య‌ట ప‌డేస్తుందా? అంటూ ఆస‌క్తిగా ట్రేడ్ సైతం ఎదురు చూస్తోంది. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. యుఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. 149 నిమిషాల నిడివితో ఉంటుంద‌ట‌. దాదాపు రెండున్నర గంటలు సాగే చిత్ర‌మిది.

తాజాగా బిజినెస్ లుక్క‌లు తెలిశాయి. శ్రీ‌నుకి గ‌త ఐదారు సినిమాలు హిట్ట‌వ్వ‌క‌పోయినా `రాక్ష‌సుడు` బిజినెస్ పై ఆ ప్ర‌భావం లేద‌ని ఈ లెక్క‌లు చెబుతున్నాయి. రాక్ష‌సుడు నైజాం- ఏపి క‌లుపుకుని 13.5 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ చేయ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 16 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. తెలుగు శాటిలైట్-6కోట్లు.. హిందీ డ‌బ్బింగ్ - శాటిలైట్ క‌లిపి -12.5 కోట్లు తెచ్చింది. ఓవ‌రాల్ గా 35 కోట్ల బిజినెస్ తో షాకిచ్చింద‌నే చెప్పాలి. ఏరియా వైజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే.. నైజాం-5.5కోట్లు.. సీడెడ్-2 కోట్లు.. వైజాగ్-1.5కోట్లు.. తూ.గో జిల్లా- 95ల‌క్ష‌లు.. ప‌.గో జిల్లా-85 ల‌క్ష‌లు.. కృష్ణ‌- 1కోటి.. గుంటూరు-1.20 కోట్లు.. నెల్లూరు  -50 ల‌క్ష‌లు...బిజినెస్ చేశారు. క‌ర్నాట‌క -1.1కోట్లు.. ఓవ‌ర్సీస్-7ల‌క్ష‌లు.. ఇత‌ర భార‌త‌దేశం -7ల‌క్ష‌ల మేర బిజినెస్ సాగింది. హిట్టు- బ్లాక్ బ‌స్ట‌ర్- సూప‌ర్ హిట్టు ఇలా ప‌రిశీలిస్తే.. 16-19 కోట్ల మ‌ధ్య వ‌సూలు చేస్తే హిట్టు. 19-24 కోట్లు వ‌సూలు చేస్తే సూప‌ర్ హిట్టు. 24 కోట్లు వ‌సూలు చేస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన‌ట్టు. 13 కోట్లు తెస్తే యావ‌రేజ్. 15 కోట్లు వ‌సూలు చేస్తే అబౌ యావ‌రేజ్. 12 కోట్ల లోపు వ‌సూలు చేస్తే ఫ్లాప్ కింద ప‌రిగ‌ణిస్తారు. 11 కోట్ల లోపు వ‌సూలైతే డిజాస్ట‌ర్ కింద లెక్క తేల్చారు ట్రేడ్ పండితులు.


Tags:    

Similar News