స్పీడున్నోడి చితక్కొట్టుడు

Update: 2017-05-03 10:21 GMT
మాస్ నే కాదు.. క్లాస్ ఆడియన్స్ సైతం విజిల్స్ వేసేలా యాక్షన్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. బాలకృష్ణతో బోయపాటి శ్రీను తీసిన సింహా - లెజెండ్ సినిమాల్లో హైలైట్ నిలిచింది యాక్షన్ పార్టులే. తర్వాత అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు సినిమాలో ఇంటర్వెల్ కు ముందు నుంచి అరివీర భయంకరమైన ఫైట్లతో అదరగొట్టేశాడు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో తీస్తున్న తాజా సినిమాలోనూ తనకు పేరు తెచ్చిన యాక్షన్ సన్నివేశాలను ఓ రేంజిలో తీసి మరో హిట్ కొట్టాలనే పట్టుపట్టాడు బోయపాటి శ్రీను.

అల్లుడు శీనుతో ఇండస్ర్టీలోకి అడుగు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఫర్వాలేదనిపించుకున్నాడు. తర్వాత భీమినేేని శ్రీనివాసరావు దర్శకత్వంలో స్పీీడున్నోడు చేశాడు. ఈ సినిమా పేరులో తప్ప ఇంకెందులోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సిినిమాలో వరస హిట్లతో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ - హిట్ కోసం పరితపిస్తున్న కంచె ఫేం ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను రెండు వారాలుగా కృష్ణాజిల్లాలో కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతమైన హంసలదీవిలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సీన్ల కోసం ఆర్ట్  డైరెక్టర్ బీచ్ ఒడ్డున భారీ సెట్ వేశాడు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ీకొత్త తరహా స్టంట్లు ప్రత్యేకంగా రూపొందించారంటున్నారు.  ఈ సినిమాలో జగపతిబాబు - తమిళనటుడు శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వీరితోపాటు చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఒకనాటి వానపాటల సుందరి వాణివిశ్వనాథ్ సైతం తిరిగి కనిపించనుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News