రామ్ గోపాల్ వర్మతో బెల్లంకొండ ఫ్యామిలీకి ఏమైనా విరోధం ఉందా అని నిన్నట్నుంచి టాలీవుడ్ జనాలకు డౌట్ కొట్టేస్తోంది. లేకపోతే అవసరం లేకున్నా ‘స్పీడున్నోడు’ సినిమాలో రామ్ గోపాల్ వర్మ మీద సెటైర్ ఎందుకు వేశారన్నదే అర్థం కావడం లేదు. ‘‘రామ్ గోపాల్ వర్మలా రోజుకో సినిమా తీయడం కాదురా.. రాజమౌళిలా రెండేళ్లకో సినిమా తీయాలి’’ అంటూ ఓ డైలాగ్ పెట్టారు ఈ సినిమాలో. ట్రైలర్లో ఈ డైలాగే బాగా చర్చనీయాంశమవుతోంది. వేరే వాళ్లను వర్మ గిచ్చడం మామూలే కానీ.. వర్మను వీళ్లెందుకు కెలికారన్నదే అర్థం కావడం లేదు. ఇది దర్శకుడు భీమనేని పెట్టించిన డైలాగా లేక బెల్లంకొండ ఫ్యామిలీనే ఉద్దేశపూర్వకంగా ఈ డైలాగ్ రాయించిందా అన్నది అర్థం కావడం లేదు.
ఏదేమైనా వర్మ మీద బెల్లంకొండ శ్రీనివాస్ సెటైర్ వేయడం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ఐతే వర్మ ఇలాంటి డైలాగుల్ని పెద్దగా పట్టించుకునే టైపు కాదు కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇబ్బందేమీ ఉండదులెండి. ‘స్పీడున్నోడు’ ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ హిట్ మూవీ ‘సుందరపాండ్యన్’కు రీమేక్ గా తెరకెక్కిందీ సినిమా. రీమేక్ సినిమాలు తీయడంలో తిరుగులేని భీమనేని.. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చాలానే చేసినట్లున్నాడు. భారీ తారాగణంతో భారీ స్థాయిలో సినిమా తెరకెక్కించనట్లున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.