'అల్లుడు శీను' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. వరుస సినిమాలతో మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సాయి శ్రీనివాస్.. తాజాగా తన అభిమానికి జీవితం కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ అభిమాని కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని, తన ఫేవరేట్ హీరో బెల్లంకొండను గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించాడు.
సాధారణంగా అభిమానులు తమ ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు శుభకార్యాలకు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. కాకపోతే హీరోల బిజీ షెడ్యూల్ కారణంగా తమ ఆహ్వానాలను గౌరవించి వస్తారని వారు ఆశించరు. కానీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన ఫ్యాన్ ఆహ్వానం మేరకు కరోనా సమయంలో హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్లి విషెస్ తెలియజేసి అతన్ని ఆశ్చర్యపరిచాడు. యువ హీరో ఒక్కడే కాకుండా తన వెంట తల్లిదండ్రులు బెల్లంకొండ సురేష్ - పద్మ.. తమ్ముడు సాయి గణేష్ లను కూడా తీసుకెళ్లి తన అభిమానికి లైఫ్ లాంగ్ మెమొరీని మిగిల్చారు. ఈ సందర్భంగా బెల్లంకొండ అతనికి కొన్ని కానుకలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలావుండగా డబ్బింగ్ సినిమాలతో నార్త్ లో ఫుల్ క్రేజ్ ఏర్పరచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతి లాల్ గడ భారీ స్కేల్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సడలించడంతో హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. దీని తర్వాత సూపర్ హిట్ ‘కర్ణన్’ చిత్రాన్ని బెల్లంకొండ తెలుగులో రీమేక్ చేయనున్నాడు.