ఐపీఎల్‌లో 'ఉత్తమ నటి' ఎవరు?

Update: 2015-05-24 17:30 GMT
ఐపీఎల్‌ సీజన్‌ ముగింపుకొచ్చింది. ఫైనల్‌ మ్యాచ్‌ ఈ రోజు రాత్రికే. ఈ సీజన్‌ ముగుస్తున్న వేళ ఎన్నో తీపిగురుతులు. చెప్పుకోదగ్గ విశేషాలెన్నో. మైదానంలో బోలెడన్ని మెరుపులు, ఉరుములు. సిక్సర్లు, ఫోర్లతో ఆటస్థలాలు మోతెక్కిపోయాయి. గ్యాలరీలో ప్రేక్షకాభిమానులంతా మస్త్‌గా ఎంజాయ్‌ చేశారు. కేవలం ఆట ఒక్కటే కాదు, చీర్‌లీడర్స్‌ చీరింగులు, స్టేడియంలో సెలబ్రిటీల హంగులు, దేశ విదేశాల నుంచి ప్లేయిర్‌, వ్యూవర్స్‌.. అదుర్సే అదుర్స్‌.

ఇకపోతే ఆదివారం సాయంత్రం 6గంటలకు చెన్నయ్‌ సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ టీమ్‌లు ఫైనల్‌ మ్యాచ్‌లో తాడో పేడో తేల్చుకోబోతున్నాయి. ఏదేమైనా ముగింపు రోజు కొందరికి సినిమాటిక్‌గా అవార్డుల్ని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అన్న చిలిపి ఆలోచనకు రూపమిచ్చారు కొందరు. అసలు ఐపిఎల్‌లో ఆడుతున్న వారికి సినిమాల టైపులో బెస్ట్‌ యాక్టర్‌.. ఉత్తమ నటి.. ఉత్తమ కమెడియన్‌ అవార్డులు ఇస్తే ఎలా ఉంటుంది? వారి వారి పెర్ఫామెన్స్‌ను బట్టి ఇలా అవార్డులు ప్లాన్‌ చేశారు చిలిపి జనం.

ఆ అవార్డుల వివరాలివి.. ఉత్తమనటుడు : విరాట్‌ కోహ్లీ, ఉత్తమ నటి: అనుష్క శర్మ (స్టేడియంలో కూచుని విరాట్‌కి హాయ్‌ చెప్పినందుకు), ఉత్తమ దర్శకుడు: మహేంద్రసింగ్‌ ధోని, ఉత్తమ ఐటెమ్‌ నంబర్‌: డ్వేన్‌ బ్రేవో (మైదానంలో స్టెప్పులేసినందుకు), బెస్ట్‌ కమెడియన్‌: పోలార్డ్‌ (మనోడి ఫీల్డింగ్‌ వేషాలు తెలిసినవే) బెస్ట్‌ ట్రాజిక్‌ హీరో: గౌతమ్‌ గంబీర్‌, బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: క్రిస్‌ గేల్‌, లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌: ఆశిష్‌ నెహ్రా, హర్భజన్‌ (చాన్నాళ్ళ నుండి ఆడుతూ కొన్ని వికెట్లు తీశారుగా..) బెస్ట్‌ డెబ్యూ: సర్ఫ్‌రాజ్‌, బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: డీవిలియర్స్‌, థ్రిల్లింగ్‌ క్లయిమాక్స్‌: టీమ్‌ ముంబై.

సరదా సరదా అవార్డులను హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్‌ చెయ్యండి.

Tags:    

Similar News