సంక్రాంతి యావరేజ్ బొమ్మలు.. వీరయ్యకు బెస్ట్ ఛాన్స్?

Update: 2023-01-12 09:30 GMT
బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో పెద్ద సినిమాల మధ్య కూడా ఊహించిన విధంగా పోటీ కొనసాగుతున్న విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఒక సినిమా ప్రభావం మరొక సినిమాపై తప్పకుండా పడుతుంది. మంచి టాక్ వస్తే కనుక రెండు సినిమాలు సేఫ్ జోన్ లోకి వస్తాయి. కానీ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి కూడా అటు తమిళంలో ఇటు తెలుగులో ఇద్దరు బడా హీరోలు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

తమిళ సినిమాలు తెలుగులో కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ వారసుడు సినిమాను తెలుగులో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్యల వలన వారసుడు వాయిదా పడింది. తమిళ వారిసు సినిమాను బుధవారం విడుదల చేశారు. ఇక జనవరి 14 తెలుగులో రాబోతోంది. అయితే తమిళంలో మాత్రం వారసుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.

విజయ్ సినిమాలకు అలాంటి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక అజిత్ తునివు సినిమా తెలుగులో తెగింపుగా విడుదల అయింది. ఈ సినిమా మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇక టాక్ పరంగా అయితే సినిమా బిలో యావరేజ్ అని అర్థమయిపోయింది.

ఇక వీర సింహారెడ్డి సినిమాకు ఇప్పుడు పెద్దగా సూపర్ హిట్ అనే రేంజ్ లో అయితే టాక్ ఏమీ రాలేదు. చాలా వరకు భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు చాలావరకు యావరేజ్ లేదా బిలో యావరేజ్ అనే విధంగానే ఉన్నాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు ఒక విధంగా ఇది బెస్ట్ అని ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కూడా అంత కొత్తగా ఏమీ లేదు. దర్శకుడు బాబి రెగ్యులర్ కమర్షియల్ తరహాలోనే మెగాస్టార్ ను ప్రజెంట్ చేయబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా మిగతా సినిమాల నుంచి ఏ విధమైన పోటీని ఎదుర్కొంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News