దేవరకొండ బ్రదర్స్‌ కు అవే బెస్ట్‌ ఫ్రెండ్స్‌

Update: 2020-09-20 06:15 GMT
జంతువులను ప్రేమించే వారు నిజమైన మానవత్వం కలిగి ఉన్న వారు అంటూ జంతు ప్రేమికులు అంటూ ఉంటారు. పెట్‌ డాగ్స్‌ ను పెంచుకునే వారు ఇతర జంతువులను ముద్దుగా పెంచుకునే వారు ఇతరులతో పోల్చితే చాలా సున్నిత మనస్కులుగా ఉంటారని అంటూ ఉంటారు. ఈమద్య కాలంలో దేవరకొండ బ్రదర్స్‌ విజయ్‌ దేవరకొండ.. ఆనంద్‌ దేవరకొండలు సోషల్‌ మీడియాలో వారి ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలతో ఫొటోలు దిగి షేర్‌ చేస్తున్నారు. వాటిని స్నేహితుల మాదిరిగా పాంపరింగ్‌ చేస్తూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

గత ఆరు నెలల కాలంగా షూటింగ్స్‌ లేకపోవడంతో పాటు బయట పార్టీలు లేకపోవడంతో దేవరకొండ బ్రదర్స్‌ కు వారి పెట్‌ డాగ్స్‌ మరింత దగ్గర అయ్యాయి. అవి వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరిగా మారడంతో పాటు స్నేహితులుగా కూడా వారితో ఆడుతూ ఉన్నట్లుగా వారిద్దరు షేర్‌ చేసిన ఫొటోలను చూస్తే అనిపించక మానదు. ఈ బ్రదర్స్‌ ఇద్దరు కూడా డాగ్స్‌ విషయంలో చూపించే వాత్సల్యంకు జంతు ప్రేమికులు కూడా ఫిదా అవుతున్నారు. కొందరు స్టేటస్‌ కోసం కుక్కలను పెంచుకున్నా వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. కాని ఈ రౌడీ బ్రదర్స్‌ మాత్రం వాటికి చాలా క్లోజ్‌ గా ఉంటూ ఇలా కూడా అందరి హృదయాలను టచ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News