చై-సామ్ వెంటనే దీనిపై క్లారిటీ ఇస్తే బెటర్..!

Update: 2021-08-26 16:30 GMT
'ఏమాయ చేసావే' తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. తన మొదటి హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలిగా మారిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ వస్తున్న సామ్.. చైతూ తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక పెళ్ళైన వెంటనే సమంత సోషల్ మీడియా మధ్యమాలలో తన పేరును 'సమంత అక్కినేని' గా చేంజ్ చేసింది. అయితే ఇటీవల తన ప్రొఫైల్ నేమ్స్ లో 'అక్కినేని' ని తొలగించి కేవలం 'S' అనే లెటర్ ని ఉంచడం చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో చై - సామ్ జంట గురించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వినిపించాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని.. నాగార్జున - అమల కలుగజేసుకునే వరకూ వచ్చిందని కూడా కామెంట్స్ వచ్చాయి. దీంతో అన్యోన్యంగా ఉన్న భార్యభర్తల మధ్య ఏమి జరిగిందని అక్కినేని అభిమానులు ఆలోచిస్తున్నారు. సమంత ఏ పోస్ట్ పెట్టినా ప్రొఫైల్ నేమ్ ఎందుకు చేంజ్ చేశారనే ప్రశ్న సంధిస్తున్నారు. మరికొందరు మాత్రం పాన్ ఇండియా మూవీ 'శాకుంతలం' ప్రమోషన్స్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. అయితే ఇంతవరకు ఈ వార్త‌ల‌పై స‌మంత స్పందించ‌లేదు.

ఇటీవల సమంత ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రొఫైల్ నేమ్‌ ను 'S' అని మార్చుకోవడంపై మాట్లాడినా.. క్లారిటీ అయితే ఇవ్వలేదు. తన చుట్టూ ఉన్న వివాదాల గురించి ఎప్పుడుప‌డితే అప్పుడు మాట్లాడ‌లేన‌ని.. ఇష్టం వ‌చ్చిన‌ప్పుడే మాట్లాడుతాన‌ని సామ్ చెప్పింది. ఎవ‌రి సొంత అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయని.. త‌న‌కు కాంట్ర‌వ‌ర్సీల గురించి మాట్లాడ‌టం న‌చ్చ‌ద‌ని చెప్పుకొచ్చింది. దీంతో సమంత-చైతన్య ల మధ్య ఏమి జరుగుతోందో అనే క్యూరియాసిటీ అందరిలో ఎక్కువైంది.

తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటో పెట్టి 'ఎప్పరటికీ నాతోనే ఉండు' అని సామ్ క్యాప్షన్ పెట్టడాన్ని కూడా వేరే టాపిక్ కు లింక్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే చైతూ - సామ్ మధ్య అలాంటిది ఏమీ లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజుల క్రితం కూడా తమ అపార్ట్మెంట్ లో ఇద్దరూ కలిసి జిమ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్స్ పై చై-సామ్ జంట వెంటనే క్లారిటీ ఇస్తే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Tags:    

Similar News