కోవిడ్ కొత్త వేరియంట్ బిఎఫ్7 గురించి వస్తున్న తాజా వార్తలు మళ్లీ సినీ పరిశ్రమని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ బిఎఫ్ 7 వేరియెంట్ మన దేశంలో కూడా వ్యాపించిందని వారిని ఐసోలేషన్ లో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఈ బిఎఫ్ 7 కి సంబంధించిన విషయాల గురించి వివరాలు ఇచ్చారు.
కోవిడ్ కొత్త వేరియెంట్ అంటే ముందుగా ఉలిక్కిపడేది మాత్రం సినీ పరిశ్రమ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాబోయే సంక్రాంతికి వేల కొద్దీ మార్కెట్ జరబోతుందని ఆశతో ఉన్నారు దర్శక నిర్మాతలు. అలాంటిది బిఎఫ్7 తో ఒకవేళ మళ్లీ ఆంక్షలు ఏవైనా విధిస్తే మాత్రం పరిశ్రమకు పెద్ద దెబ్బ పడినట్టే అవుతుంది.
ఒకవేళ సినిమా రిలీజ్ లు ఆగే పరిస్థితి వస్తే మాత్రం నిర్మాతలకు చాలా కష్టమని చెప్పొచ్చు. కోవిడ్ మొదటి, రెండు వేవ్ ల టైం లో అసలు ప్రేక్షకులు థియేటర్ లకు వస్తారా రారా అన్న ఆందోళన నుంచి ఎలాగోలా 2022 ప్రశాంతంగానే ముగుస్తుందని అనుకున్నారు.
2023 కూడా సంక్రాంతి నుంచే సినిమాల సందడి షురూ చేశారు. కానీ బిఎఫ్7 రూపంలో మరో ముప్పు రాబోతుందని హెచ్చరిస్తున్నారు. బిఎఫ్ 7 ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది. కేంద్రం దీనిపై ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకుంటుంది అన్నది తెలియదు కానీ ఆ బిఎఫ్ 7 వల్ల సినీ పరిశ్రమ పెద్ద లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
మరి వ్యవహారం అంత దాకా రాకుండానే చేస్తారా లేదా అన్నది ఇప్పుడప్పుడే ఎవరు చెప్పలేని పరిస్థితి. జనాలు మాత్రం బిఎఫ్7 వేరియంట్ గురించి చాలా తేలికగా తీసుకుంటున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇది వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవేళ వ్యాప్తి చెందడం మొదలు పెడితే మరోసారి ఆంక్షలు విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.