భాగమతి అడ్డాలో 21 కోట్లు

Update: 2018-02-03 12:46 GMT
స్టార్ హీరోల సినిమాలో చిన్న తేడా అనిపించినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్న ట్రెండ్ లో ఒక హీరొయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అందులోనూ తాను తప్ప మిగిలిన కీలక తారాగణమంతా పర బాషా నటులు ఉన్న మూవీతో అనుష్క భారీ వసూళ్లు దక్కించుకుని తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది. మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగు పెట్టిన భాగమతి ఇంకా దూసుకుపోతునే ఉంది. ట్రేడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు సుమారు 40 కోట్ల దాకా గ్రాస్ తో 21 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది.ఏ లెక్కలో చూసుకున్నా హీరో లేని సినిమాకి ఇది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. నిన్న వచ్చిన సినిమాలు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం అంతగా లేదు అనే రిపోర్ట్స్ ఉన్నాయి.

ఏరియాల వారిగా చూసుకుంటే వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి

                          షేర్  (కోట్లలో)

నైజాం                       6.5
సీడెడ్                       2.5
నెల్లూరు                    0.71
గుంటూర్                   1.35
కృష్ణా                        1.16
వెస్ట్                          0.90
ఈస్ట్                         1.32
ఉత్తరాంధ్ర                   2.07

తెలుగు రాష్ట్రాలు           16 కోట్లు(సుమారు)

కర్ణాటక                      1.8
రెస్ట్ అఫ్ ఇండియా         0.5
ఓవర్సీస్                     3.2

మొదటి వారం వసూళ్లు    21.8 కోట్లు(సుమారు)

ఇవి నిర్మాత వెల్లడించిన లెక్కలు కానప్పటికీ ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు వీటిని చాలా డీసెంట్ ఫిగర్ గా చెప్పుకోవచ్చు. జైసింహను ఓవర్ టేక్ చేసి భాగమతి రికార్డు క్రాస్ చేయటం ఖాయం అని చెప్పొచ్చు. ఇంకో వారం దాకా సినిమాల హడావిడి లేదు కాబట్టి నిన్న పాజిటివ్ టాక్ వచ్చిన ఛలో తో పాటు భాగమతికి అప్పటిదాకా బ్రేకులు పడేలా లేవు. బ్రేక్ ఈవెన్ చేరుకున్న భాగమతి అనుష్క ఇమేజ్ మార్కెట్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంత బలంగా ఉందో ఋజువు చేసింది. హారర్ జానర్ మూవీకి ఇంత రావడం అంటే విశేషమే. వారం దాకా ట్రెండ్ ఇలాగే కొనసాగితే భాగమతి భారీ హిట్ గా మిగులుతుంది.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News