మరో మైలురాయి ముంగిట అనుష్క

Update: 2018-02-04 07:34 GMT
‘అరుంధతి’లో అనుష్క ప్రతిభ కంటే కథాకథనాల బలం కనిపిస్తుంది. ‘రుద్రమదేవి’ సక్సెస్ క్రెడిట్లో చాలా వరకు అల్లు అర్జున్ తీసుకుపోయాడు. అనుష్క నటించిన మిగతా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో నిజంగా అనుష్క బాక్సాఫీస్ స్టామినా ఎంత అనే విషయంలో సందేహాలున్నాయి. ఐతే ‘భాగమతి’ ఆ సందేహాలకు తెరదించింది. ఈ సినిమాలో కథాకథనాలు అంత బలంగా ఏమీ లేవు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని మించి పెర్ఫామెన్ చేస్తూ.. రెండో వారంలో కూడా స్టడీగా సాగుతోంది.

‘భాగమతి’ లాంటి సినిమాకు అమెరికాలో ఏమాత్రం స్పందన ఉంటుందో అని సందేహించారు. కానీ ఈ చిత్రం ఏకంగా మిలియన్ డాలర్ మార్కు వైపు పరుగులు పెడుతోంది. తొలి వారాంతంలోనే 7 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ‘భాగమతి’.. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదని అంచనా వేశారు. కానీ వీక్ డేస్‌ లో కూడా ఓ మోస్తరు వసూళ్లతో సాగిందీ సినిమా. ఇప్పటిదాకా ఈ చిత్రం 9.8 లక్షల డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ వీకెండ్ ముగిసేసరికి మిలియన్ మార్కును అందుకోవడం లాంఛనమే కావచ్చు. ఇది అనుష్క బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం. లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకోవడానికి అనుష్క అర్హురాలన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News