మెగాఫోన్ పట్టిన తరువాత కొన్ని సినిమాలు హిట్ కావడం .. మరికొన్ని సినిమాలు పోవడం సహజం. అలాగే తమ సినిమాలు హిట్ అయినప్పుడు సంతోషపడటం .. పరాజయం పాలైనప్పుడు బాధపడటం కూడా అంతే సహజం. అయితే బాగా ఆశలు .. అంచనాలు పెట్టుకున్న సినిమా దెబ్బతిన్నప్పుడు కలిగే బాధ వేరేగా ఉంటుంది. అలాంటి బాధను తాను అనుభవించానని తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చెప్పుకొచ్చాడు.
నేను చేసిన మొదటి రెండు సినిమాలు 'అహ నా పెళ్లంట' .. 'పూలరంగడు' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత నేను మూడో సినిమాగా నాగార్జునగారితో 'భాయ్' చేశాను. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. దాంతో అంతా కూడా సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాము.
కానీ 'భాయ్' సినిమా పోయింది .. నాగార్జునగారు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయానే అనే బాధ నన్ను కుదురుగా ఉండనీయలేదు. ఎందుకు పోయిందో అర్థంకాక అయోమయంలో పడిపోయాను. అందువల్లనే అవకాశాలు వచ్చినప్పటికీ ఒక ఏడాది పాటు సినిమా చేయలేదు. ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉండటం .. విడుదల తేదీలు వాయిదా పడుతూ రావడం .. సరైన సమయంలో విడుదల కాకపోవడం కూడా ఈ సినిమా ఫలితంపై ప్రభావం చూపాయని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.