ఈ క్రిస్మస్ బరిలో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఈ సినిమాలలో వేటిపైనా భారీ అంచనాలేమీ లేవు. టాలీవుడ్ లో ఉన్న డజను స్టార్ హీరోల్లో ఎవరూ నటించినవి కావు కాబట్టి మరీ అనవసర ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోలేదెవరూ. అయితే కాస్తో కూస్తో అనుకున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అనుకోని రెండు సినిమాలు మాత్రం హిట్టు కొట్టాయి. ఈ క్రిస్ మస్ కి ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది.
ఈ సీజన్‌లో గోపిచంద్ నటించిన సౌఖ్యం - మోహన్ బాబు - అల్లరి నరేష్ నటించిన మామ మంచు-అల్లుడు కంచు - సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు - వారాహి చలనచిత్రం జతకలిసే సినిమాలు రిలీజయ్యాయి. అయితే కాస్త స్టార్ డమ్ ఉన్న మొదటి రెండు సినిమాలు యథావిధిగానే రొటీన్ కంటెంట్ తో జనాల సహనం పరీక్షించాయి. ఫలితం కూడా అలానే వచ్చింది. ఇక పూర్తి స్థాయి కొత్తదనంతో బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది సుధీర్ బాబు సినిమా. టైటిల్ కి తగ్గట్టే ఒక్కరోజులో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా సంథింగ్ ఎక్స్ పెరిమెంటల్ అన్న పేరు తెచ్చుకుంది. అందుకు తగ్గట్టే జనాదరణ పొందుతోంది. ఇక అస్సలు స్టార్ కాస్టింగ్ అనేదే లేకుండా వచ్చిన జత కలిసే పెద్ద విజయం అందుకుంది. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా చక్కని ఓపెనింగులు సాధించింది.
పాపం మంచు-కంచు పెద్ద ఝలక్ తిన్నారు. గోపిచంద్ లౌక్యం మార్క్ హిట్ అందుకోలేపోయాడన్న విమర్శలొచ్చాయ్. ఈ రెండు సినిమాల్లో కంటెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని జనాలే ఫిక్సయిపోయారు. అదన్నమాట.