పద్మావత్ లో చాలా రహస్యాలు ఉన్నాయి

Update: 2018-02-04 05:50 GMT
పద్మావత్ ఎట్టకేలకు విడుదలై విజయం సాధించినా అందరి మనస్సులో ఇంకా పలు అనుమానాలు శేష ప్రశ్నల రూపంలో అలాగే మిగిలిపోయాయి. సెన్సార్ కట్స్ కు ఒప్పుకుని - కర్ణి సేన అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వచ్చిన ప్రతి సీన్ ని తనే స్వయంగా కత్తిరించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బదులు చెప్పాల్సిన వాటి గురించి మీడియా ప్రయత్నిస్తూనే ఉంది. కాని భన్సాలీ మాత్రం దొరకటం లేదు. అందుకే ఎవరు దొరికినా సమాచారం లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక సినిమా ప్రమోషన్ అందరి కన్నా ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నది రన్వీర్ సింగ్. అల్లాయుద్దిన్ ఖిల్జీగా కామం - క్రూరత్వం ఒళ్లంతా నిండిన పాత్రలో అతను జీవించిన తీరుకు అమితాబ్ - షారుఖ్ లాంటి దిగ్గజాలు సైతం ప్రత్యేకంగా అభినందించారు.

అల్లాయుద్దిన్ ఖిల్జీగా రన్వీర్ సింగ్ చాలా గొప్పగా నటించాడు కాని అ పాత్రను చిత్రీకరించిన విధానం మీద ఇప్పుడు కూడా సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇందులో ఖిల్జీని స్వలింగ సంపర్కుడు అనే నిజాన్ని జిమ్ శరభ్ పోషించిన మాలిక్ కాఫుర్ పాత్ర ద్వారా చాలా స్పష్టంగా చెప్పాడు భన్సాలీ. దానికి తగ్గట్టు కొన్ని సీన్స్ లో ఇద్దరు ఎంత చనువుగా ఉంటారు, ఇద్దరి మధ్య ఎంతటి సాంగత్యం ఉండేదో అనే విషయాన్ని చూపించడనికి భన్సాలీ ప్రత్యేకంగా కొన్ని సీన్స్ చిత్రీకరించాడట. కాని అవన్నీ ఎడిటింగ్ టేబుల్ లోనే ఎగిరిపోయాయి. బింతె దిల్ పాట రావడానికంటే ముందు ఖిల్జీ - కాఫుర్ మధ్య ఒక బాత్ టబ్ సీన్ కూడా తీసారని బాలీవుడ్ మీడియా కథనం. ఇలాంటివి చాలానే ఎగిరిపోయాయని దీని గురించి జిమ్ శరభ్ తనకు ఫోన్ చేసి అధిక భాగం సీన్స్ కట్ చేసారే అని వాపోతూ రన్వీర్ సింగ్ కి ఫోన్ చేసి అడిగారట.

ఈ విషయాలన్నీ రన్వీర్ సింగ్ స్వయంగా ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. సినిమా రెండున్నర గంటల్లోనే ఉన్నా దాని ఒరిజినల్ ఫుటేజ్ ఆరేడు గంటలు ఉంటుందని, ఎడిటింగ్ లో చాలానే కట్ చేస్తారని చెప్పిన రన్వీర్ సింగ్ తనకు కాఫుర్ పాత్రకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ తీసేసారని ఒప్పుకున్నాడు. దానికి బదులుగా జిమ్ శరభ్ అంత హాట్ గా కనిపించాడా అంటూ ఒక లేడీ జర్నలిస్ట్ ను రివర్స్ లో ప్రశ్నించడం అందరికి షాక్ కి గురి చేసింది. డైరెక్టర్ కట్ వెర్షన్ అని డివిడిలో పూర్తి సినిమా విడుదల కావడం అనేది సాధారణంగా జరిగేదే. ఒకవేళ పద్మావత్ కు కూడా అలా రిలీజ్ చేస్తే ఖిల్జీ - కాఫుర్ మధ్య ఏం జరిగింది అనేది హాట్ హాట్ గా చూడొచ్చు.
Tags:    

Similar News