మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ అనగానే హమ్ దిల్ దే చుకే సనమ్ - దేవ్ దాస్ చిత్రాలు గుర్తుకొస్తాయి. వెండితెరపై మరపురాని దృశ్యకావ్యాల్ని ఆవిష్కరించారు ఈ జోడీ. భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్లో చూపించిన గ్రేట్ మూవీస్ గా వీటి గురించి చెబుతారు. గొప్ప కథ - విజువల్ గ్రాండియారిటీ - గ్రేట్ ఎమోషన్ భన్సాలీ ఆయుధాలు. ఆయన ఓ సినిమా తీస్తున్నారు అంటే అందులో వర్ణరంజితమైన విజువల్స్ గురించి ప్రత్యేకించి డిబేట్ నడుస్తుంటుంది.
రీసెంటుగానే భన్సాలీ పద్మావత్ 3డి చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో దీపిక పదుకొన్ నటించింది. రిలీజ్ వేళ వివాదాల గురించి తెలిసిందే. రాణీ పద్మిని చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ అటు రాజ్ పుత్ లు - ముస్లిమ్ వీరుడు అయిన మహమ్మద్ ఖిల్జీని క్రూరుడిగా - నీతి లేనివాడిగా చూపిస్తున్నారంటూ ఇటు ముస్లిమ్ వర్గాలు భన్సాలీపై కత్తిగట్టాయి. ఆ క్రమంలోనే కోర్టుల పరిధిలో వివాదాన్ని పరిష్కరించుకుని ఎట్టకేలకు భన్సాలీ విజయవంతంగా రిలీజ్ చేశారు. ఇందుకోసం ఆయన ఏకంగా అల్లరి మూకల చేతిలో దెబ్బలు కూడా తినాల్సొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ సినిమా గురించి మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా రివీల్ చేశారు. వాస్తవానికి పద్మావతి పాత్రలో తాను నటించాల్సింది. కానీ ఖిల్జీ పాత్ర ధారి సెట్టవ్వకపోవడం వల్లనే అది కుదరలేదు. ఆ తర్వాత దీపిక పదుకొన్ ఆ పాత్రలో నటించింది. ఇదే కాదు భాజీరావ్ మస్తానీ చిత్రంలోనూ దీపిక స్థానంలో నటించాల్సింది. అది కూడా మిస్సయ్యింది అని ఐష్ తెలిపారు. ఇకపోతే భన్సాలీ ఖిల్జీ పాత్రలో సల్మాన్ ఖాన్ ని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, అతడు రాణా రావల్ పాత్రలో అయితేనే నటిస్తానని అనడంతో అప్పట్లో ఆ పాత్రలో రణవీర్ సింగ్ ని ఎంపిక చేసుకున్నారు. ఖిల్జీ పాత్రలో సల్మాన్ నటిస్తానని అంటే నేను నటించను అని ఐశ్వర్యారాయ్ అప్పట్లో మొండికేశారన్న ప్రచారం ఉంది.