అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అసలే అఖిల్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు. కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి హిట్ అనే మాట వినలేదు. అలాంటి ఆయన భాస్కర్ కి ఛాన్స్ ఇవ్వడమేంటి? అనుకున్నారు. ఎందుకంటే 'బొమ్మరిల్లు' తరువాత ఆయన ఆ స్థాయి సినిమాను చేయలేకపోయాడు.. ఆ స్థాయి హిట్ ను కొట్టలేకపోయాడు. అయినా ఆయన ఈ కామెంట్లను పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు - వాసు వర్మ ఈ సినిమాను నిర్మించారు. విజయదశమి కానుకగా ఈ సినిమా ఈ నెల 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. పూజ హెగ్డే కథానాయికగా అలరించిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడాడు.
"ఒక సినిమా సక్సెస్ మీట్ ను జరుపుకుంటుందంటే అంతకంటే ఒక డైరెక్టర్ కి ఏం కావాలి? ఇందుకు కారకులైన అల్లు అరవింద్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. అలాగే బన్నీ వాసు కూడా ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఇక వాసు వర్మ ప్రతి అడుగులో నాతో కలిసి ట్రావెల్ చేశాడు. నా కష్టనష్టాలన్నిటిలో నాతో కలిసి ట్రావెల్ చేశాడు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక గోపీసుందర్ అందించిన పాటలు మ్యాజిక్ చేశాయి.
అఖిల్ అక్కినేని విషయానికి వస్తే ఈ సినిమాతో ఆయన అందరికీ దగ్గరయ్యాడని నాకు చాలా హ్యాపీగా ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు .. మీడియా మిత్రులలో ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీమచ్. పూజ హెగ్డే పెట్టిన ఎఫర్ట్ ఈ సినిమాకి బాగా కుదిరింది. ఈ సినిమా చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి పేరు పేరున థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సక్సెస్ వెనుక నా డైరెక్షన్ టీమ్ కృషి ఎంతో ఉంది. ఇంతటి విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించాడు.