భేడియా.. కొంత కాలంగా అందరి నోళ్లలో నానుతున్న టైటిల్ ఇది. ఈ చిత్రంతో బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటాలని కలలు కంటున్నాడు. హిందీ-తెలుగు-తమిళం సహా ఇతర భాషల్లోను భేడియా విడుదల కానుంది. బ్రహ్మాస్త్ర తర్వాత బాలీవుడ్ నుంచి ప్రాంతీయ భాషల్లో విడుదలవుతున్న భారీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే రిలీజైన టీజర్ లో వరుణ్ సరికొత్త పాత్రతో సర్ ప్రైజ్ చేసాడు. అతడు పౌర్ణమి వేళ తోడేలుగా మారే యువకుడిగా కనిపిస్తూ ప్రయోగాత్మక కథలో లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో నటించాడు.
ఇది ఈ సీజన్ లో మోస్ట్ అవైటెడ్ హారర్ కామెడీ ఇది. ప్రస్తుతం భేడియా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత రిలీజ్ చేస్తుండడంతో అంతటా సందడి నెలకొంది. వరుణ్ ధావన్ - కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్త్రీ - రూహి చిత్రాల ఫేం దినేష్ విజన్ నిర్మాత. హర్రర్ కామెడీ యూనివర్స్ లో మూడవ భాగంగా వస్తోంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్ పాటలు ఆకట్టుకున్నాయి. భేడియా భారతీయ నిండిన సరి కొత్త వేర్వోల్వ్స్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వరుణ్ ధావన్-క్రితి సనన్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది.
తాజా కథనాల ప్రకారం భేదియా గోవాలోని 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘనమైన ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. హర్రర్ కామెడీ మూవీ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అనంతరం థియేటర్లలో విడుదలవుతుంది. భేడియా నవంబర్ 25 న థియేటర్లలో విడుదల అవుతుంది. ప్రీమియర్ లను కొన్ని రోజుల ముందే సిద్ధం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుణ్ ధావన్- కృతి సనన్- దీపక్ దోబిర్యాల్- అభిషేక్ బెనర్జీ- దర్శకుడు అమర్ కౌశిక్ -నిర్మాత దినేష్ విజన్ సహా చిత్ర బృందం మొత్తం గ్రాండ్ ప్రీమియర్ కి హాజరవుతున్నారని తెలిసింది.
థియేట్రికల్ విడుదలకు ముందే ప్రేక్షకులు 53వ IFFIలో మా చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. IFFI ఉత్సవాల్లో భేదియా చాలా అంచనాలతో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం కథాంశం ఆసక్తికరం. ప్రీమియర్ చాలా ఉత్కంఠకు తెర తీస్తుంది. అంతేకాదు... భేదియా చాలా ఎక్కువ ఆరంభ వసూళ్లను అందుకోబోతున్నట్లు కూడా కథనాలొస్తున్నాయి. మీడియా సోషల్ మీడియా రెండింటా అందరి దృష్టిని ఆకర్షించిందని టాక్ స్ప్రెడ్ అవుతోంది.
దిల్‌వాలే తర్వాత వరుణ్ ధావన్ - కృతి సనన్ రెండవ సారి జంటగా నటించారు. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వరుణ్ తోడేలు దాడికి గురైన తర్వాత తానే తోడేలుగా మారేవాడిగా ధావన్ సరికొత్త పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో కృతి సనన్ డాక్టర్ అనిక పాత్రలో కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.