పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి బిగ్ హిట్ ‘సుస్వాగతం’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘లవ్ టుడే’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. రీమేక్ చిత్రాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘అన్నవరం’ అనే మరో రీమేక్ మూవీ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. నిరాశ పరిచింది. ఐతే ‘సుస్వాగతం’ తర్వాత.. ‘అన్నవరం’ కంటే ముందు పవన్-భీమనేని కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సిందట. అది రీమేక్ కూడా కాదట. పవన్ సొంతంగా ఈ చిత్రానికి స్టోరీ ఐడియా కూడా ఇచ్చాడట. కానీ తనే ఆ సినిమా చేయలేకపోయానని అంటున్నాడు భీమనేని.
పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఈ సంగతి వెల్లడించాడు భీమనేని. ‘‘సుస్వాగతం రిజల్ట్ విషయంలో కళ్యాణ్ బాబు చాలా సంతోషించాడు. అందులో తండ్రీ కొడుకుల బంధాన్ని నేను డీల్ చేసిన తీరు ఆయనకు నచ్చింది. దీంతో మళ్లీ మనం ఇంకో సినిమా చేద్దాం అన్నాడు. కొన్నేళ్ల తర్వాత నన్ను పిలిచి మాట్లాడారు. అప్పటికి నేను ఒకట్రెండు ఫెయిల్యూర్లతో వెనుకబడ్డాను. ఇంతకుముందు మనం సినిమా చేద్దామనుకున్నాం కదా.. ఎందుకొచ్చి కలవలేదు అని అడిగాడు. ఐతే పవన్ అప్పుడు వరుస హిట్లతో పెద్ద స్టార్ అయిపోయాడు. నేను ఫ్లాపుల్లో ఉన్నాను. అలాంటి టైంలో వెళ్లి పాత మాట గుర్తు చేసి సినిమా అడగడం భావ్యం కాదనిపించింది. అందుకే రాలేదని చెప్పాను. అప్పుడాయన ఒక తండ్రీ కొడుకులకు సంబంధించిన రిలేషన్ నేపథ్యంలోనే ఒక లైన్ నాకు చెప్పారు. దాన్ని డెవలప్ చేసుకుని రమ్మన్నారు. సినిమా చేద్దామన్నారు. ఐతే నేను దాని మీద కొంచెం వర్క్ చేశా కానీ.. నా సొంత ప్రొడక్షన్లో మొదలుపెట్టిన ‘నీ తోడు కావాలి’ కారణంగా పవన్ తో వెంటనే సినిమా చేయలేకపోయాను. మధ్యలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ఫారిన్ వెళ్లొచ్చాక పవన్ నన్ను పిలిచి మాట్లాడారు. నాకు లేట్ అవుతుండటంతో తన సొంత డైరెక్షన్లో సినిమా చేస్తానని.. మన కాంబినేషన్లో తర్వాత చూద్దామని అన్నారు. అలా మా కాంబినేషన్లో రావాల్సిన డైరెక్ట్ మూవీ మధ్యలోనే డ్రాప్ అయింది. ఆ తర్వాత అన్నవరం చేశాం’’ అని భీమనేని వెల్లడించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/