పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్ లో `భీమ్లా నాయక్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియం` చిత్రానికి రీమేక్ ఇది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
భీమ్లా నాయక్ అంటూ ఇటీవల చిత్రబృందం చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఆ పేరులోనే హై పంచ్ ఆకట్టుకుంది. ఇప్పుడు టైటిల్ థీమ్ ఆడియో ఒకటి `భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్` పేరుతో రిలీజైంది. అంతర్జాలంలో లీకైంది. అసలు సినిమా కథాంశం ఎలా ఉంటుంది? అన్నదానికి సింబాలిక్ గా ఉందీ థీమ్డ్ ఆడియో.లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసిపట్టు.. పిచ్చి కొట్టు.. అంటూ థీమ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇందు లో పవన్ కల్యాణ్ కోపోద్రిక్తమై అరుపు వినిపిస్తోంది. ఏయ్ డేనీ..బయటికి రారా నా కొ..క.. రేయ్ రేయ్ రేయ్ రా..! అంటూ కాస్త ఘాటైన పదజాలమే వాడారు. ఇది ఒరిజినల్ లోని అయ్యప్పన్ పాత్ర..
డేనియల్.. డేనియల్ సీజర్ .. బీమ్లా బీమ్లా నాయక్.. ఏం చూస్తున్నావ్ కింద క్యాప్షన్ లేదనా? అక్కర్లేదు .. ఎక్కు బండెక్కు.. అంటూ రానా వాయిస్ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఇందులో కోషియం పాత్రలో రానా నటిస్తున్నారని అర్థమవుతోంది. అయితే తెలుగు వెర్షన్ లో భీమ్లా నాయక్ .. రానా పేరు డేనియల్ అని అర్థమవుతోంది. ఒరిజినల్ లో రానా పాత్రను బిజు మీనన్ చేయగా... బీమ్లా నాయక్ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు. తాజాగా రిలీజైన బీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. పవన్ ఆవేశంగా అరిచే అరుపు.. రానా ధీమాగా చెప్పే మాట ఆద్యంతం సీరియస్ నెస్ తో కూడుకున్న ఫన్ ని జనరేట్ చేస్తున్నాయి. గోవా టూర్ వెళుతున్న నాయక్ దారి తప్పాక లిక్కర్ తో పోలీసులకు చిక్కాక ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా సింగిల్ లైన్. మార్గమధ్యంలో పోలీస్ తో నాయక్ గొడవ ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఒక చిన్న మిస్టేక్ తో భీమ్లా నాయక్ ని అరెస్ట్ చేయాల్సొస్తుంది.
Full View