'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్: ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇందులో రానా దగ్గుబాటి మరో2హీరో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. రిటైర్డ్ హవల్దార్ రోల్ లో రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ విశేష స్పందన తెచ్చుకుంది. నేడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ మరో సర్ప్రైజింగ్ గిఫ్ట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లుగానే 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
'భీమ్లా నాయక్' మూవీ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో కంటే ముందే లిరిక్స్ ని విడుదల చేసి చిత్ర బృందం సంచలనం రేపింది. ఈ క్రమంలో తాజాగా రిలీజైన సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 'సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రంనీళ్ల గుట్టాకాడ.. అలుగూ వాగు తాండాలోన.. బెమ్మాజెముడు చెట్టున్నాది' అంటూ మొదలైన ఈ పాట సబ్ ఇన్స్పెక్టర్ భీమ్లా నాయక్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ సాగింది.
'ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా.. నిమ్మళంగ కనబడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా.. ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క.. చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క' అంటూ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. ఇందులో రెగ్యులర్ గా ఉపయోగించే పదాలు కాకుండా కొత్త పదప్రయోగం చేసే ప్రయత్నం చేశారు.
'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల - శ్రీ కృష్ణ - పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. లిరికల్ వీడియో అయినప్పటికీ విజువల్ గా గ్రాండ్ గా చూపించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సాంగ్ లో థమన్ - శివమణి మరియు మిగతా టీమ్ అందరూ కలిసి పెరఫార్మ్ చేశారు. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం మీద ఈ పాట పవన్ బర్త్ డే ను మరింత స్పెషల్ గా మార్చిందని చెప్పవచ్చు.
కాగా, మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా 'భీమ్లా నాయక్' రూపొందుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Full View