పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ.. తొలి రోజే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో ప్రదర్శించబడింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
''భీమ్లా నాయక్'' సినిమా మొదటి రోజు నైజాంలో ₹ 11.80 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ గా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ రికార్డ్ ఇంతకముందు 'పుష్ప: ది రైజ్' సినిమా (₹ 11.44 కోట్లు) పేరిట ఉండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిత్రం దాన్ని బ్రేక్ చేసింది.
'సాహో' (9.41 Cr) - 'బాహుబలి 2' (8.9 Cr) - 'వకీల్ సాబ్' (8.75 కోట్లు) - 'సరిలేరు నీకెవ్వరు' (8.67 కోట్లు) వంటి సినిమాలు తొలి రోజు నైజాంలో అత్యధిక షేర్ వసూళ్లు సాధించిన జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ''భీమ్లా నాయక్'' మూవీ 11.80 కోట్ల షేర్ తో టాప్ లో నిలిచింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'భీమ్లా నాయక్' చిత్రానికి ఫస్ట్ డే ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని 32.56 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ లో ఇప్పటికే ఈ చిత్రం 1.25 మిలియన్ల డాలర్లు వసూళ్ళు సాధించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన స్టామినా ఏమాత్రం తగ్గ లేదని ఈ సినిమా నిరూపించిందనే చెప్పాలి.
'భీమ్లా నాయక్' ఏరియాల కలెక్షన్స్ వివరాలు చూస్తే...
నైజాం - 11.80
సీడెడ్ - 4.30 కోట్లు
ఉత్తరాంధ్ర - 2.06 కోట్లు
ఈస్ట్ - 2.09 కోట్లు
వెస్ట్ - 2.30 కోట్లు
గుంటూరు - 2.10 కోట్లు
కృష్ణ - 2.01 కోట్లు
నెల్లూరు - 2.18 కోట్లు
కాగా, 'భీమ్లా నాయక్' చిత్రాన్ని మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు. సాగర్.కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు - స్క్రీన్ ప్లే అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.