సడెన్ గా డేట్ ప్రకటించి షాకిచ్చాడు భీమ్లా నాయక్. తాను ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ గానే ఉంటుందని నిరూపించాడు. ఈ క్షణం వరకూ అసలు భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కావడం లేదనే అంతా అనుకున్నారు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ఇంతలోనే పవర్ స్టార్ షాకిచ్చాడు. తాను రేసులో వెనక్కి తగ్గేదే లేదని నిరూపిస్తూ భీమ్లా నాయక్ రిలీజ్ తేదీని కన్ఫామ్ చేశాడు.
అకస్మికం ఆశ్చర్యం అనిపించేలా భీమ్లా నాయక్ నిర్మాతలు ఈ నెల 25న భీమ్లా నాయక్ థియేటర్లలోకి వస్తున్నాడని ప్రకటించారు. కొత్త పోస్టర్ పై విడుదల తేదీని ఆవిష్కరించారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ డాషింగ్ లుక్ లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్ నియమం దృష్ట్యా భీమ్లా నాయక్ ఏప్రిల్ 1కి వాయిదా వేయవచ్చని చాలా మంది అంచనా వేశారు.
అయితే ఫిబ్రవరి 25న సినిమా థియేటర్లలోకి వస్తుందని అనౌన్స్ చేయడంతో అంతా షాకయ్యారు. నిజానికి మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ``25 - 02 - 2022!! పవర్ స్టార్మ్ తెరపైకి రావడానికి తేదీ సెట్ చేసాం`` అంటూ ప్రకటించి బిగ్ ఝలక్ ఇచ్చారు. భీమ్లా నాయక్ మేకర్స్ నుండి తాజా సోషల్ మీడియా పోస్ట్ వేడెక్కించింది.
మారిన పరిణామంతో ఇప్పుడు భీమ్లా నాయక్ మరో 10 రోజుల్లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది కాబట్టి మేకర్స్ త్వరలో సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభిస్తారని అర్థమవుతోంది. తదుపరి మరింతగా ప్రచారానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... భీమ్లా నాయక్ రిలీజ్ తేదీ ప్రకటనతో.. వరుణ్ తేజ్ -గని... శర్వానంద్ - ఆడవాళ్లు మీకు జోహార్లు .. కిరణ్ అబ్బవరం - సెబాస్టియన్ లకు బిగ్ ఝలక్ తగిలినట్టేనని భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఈ నెల 25 న థియేటర్లలోకి రానున్నాయి. ఇంతలోనే అదే డేట్ కి వస్తున్నాను అంటూ భీమ్లా ప్రకటించడం నిజంగా బిగ్ షాక్ అని చెప్పాలి.