పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో వస్తున్న పాటల విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. పాటను చాలా ఇంట్రెస్ట్ గా మల్చేందుకు గాను మ్యూజిక్ కంపోజర్స్ మరియు సింగర్స్ ను కూడా చూపిస్తున్నారు. యూట్యూబ్ లో నార్మల్ గా లిరిక్స్ మాత్రమే చూపించకుండా సినిమాలోని కొన్ని షాట్స్ ను.. స్టిల్స్ ను మరియు పాట రికార్డింగ్ మేకింగ్ వీడియోలను కూడా చూపిస్తూ వస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విజువల్స్ అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి.
పవన్ స్టైలిష్ లుక్ తో పాటు థమన్ ఇంకా సింగర్స్ టెక్నీషియన్స్ విజువల్స్ ను కూడా పాటలో చూడవచ్చు. అయితే సింగర్స్ మరియు థమన్ ఒక ఫారెస్ట్ లో ఉన్నట్లుగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. పాట కోసం ఫారెస్ట్ కు వెళ్లి మరీ షూట్ చేసినట్లుగా అంతా భావించారు. ఆ తర్వాత ఫారెస్ట్ సెట్ వేశారు.. అందులో థమన్ అండ్ టీమ్ షూట్ చేశారని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫారెస్ట్ పూర్తిగా వీఎఫ్‌ఎక్స్ వర్క్. థమన్ టీమ్ పూర్తిగా గ్రీన్ మ్యాట్ పై యాక్ట్ చేయగా 3డి లో మోడల్స్ ను క్రియేట్ చేసి.. వీఎఫ్‌ఎక్స్ లో మిక్సింగ్ చేశారట. వీఎఫ్‌ఎక్స్ వర్క్ అద్బుతంగా వచ్చింది.. చాలా సహజంగా ఉండటంతో నేరుగా అడవిలోనే చేశారా అనే అనుమానాలు కొందరికి కలుగుతున్నాయి. అసలు ఎక్కడ కూడా గ్రీన్ మ్యాట్ లో అన్నట్లుగా లేదు. భీమ్లా నాయక్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న థమన్ ఈ పాటకు ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ టీమ్ తో గ్రాఫిక్స్ చేయించాడు.
పాట ఆరంభంలో వచ్చే విజువల్స్ కూడా అత్యంత అరుదైనవిగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా.. భీమ్లా నాయక్ కు ఉన్న క్రేజ్ కు తగ్గట్లుగా పాట మరియు దాని విజువల్స్ ఉన్నాయనే టాక్ ను థమన్ దక్కించుకున్నాడు. ముందు ముందు కూడా తప్పకుండా భీమ్లా నాయక్ లోని ఇతర పాటలకు థమన్ ఇదే స్థాయిలో ఎఫర్ట్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ లో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ పోలీస్ గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
Full View