మలయాళం సినిమా అయ్యప్పనుం కోషియమ్ ని తెలుగులో `భీమ్లా నాయక్` టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాతృకలో బిజుమీనన్ పోషించిన కోషియమ్ పాత్రను పోషిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పోషించిన అయ్యప్పనుమ్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే భీమ్లా నాయక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో పవన్ ని ఏ స్థాయిలో చూపించారో తెలిసిందే. పవన్ అభిమానులకు పునకాలు వచ్చేలా ఓ రేంజ్ లో టైటిల్ థీమ్ ని రిలీజ్ చేయడం చర్చకు వచ్చింది. ఇక మాతృకలో ద్వితియార్థంలో రెండు పాత్రలు పోటా పోటీగా సాగుతాయి. నువ్వా? నేనా అన్నట్లు ఆ రెండు పాత్రలు ఆద్యంతం రక్తి కట్టిస్తాయి. సంఘంలో ఒక ఈగోయిస్టిక్ పెద్దమనిషికి సిన్సియర్ పోలీసాఫీసర్ కి మధ్య సాగే టిట్ ఫర్ ట్యాట్ గేమ్ ని తెరపై చూపించనున్నారు.
మరి తెలుగు వెర్షన్ పరిస్థితి ఏంటో అర్థం కాని వ్యవహారంగా ఉంది అంటూ కథనాలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇది నిజంగా అంతకంతకు గమ్మత్తుగానే కనిపిస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఎక్కడా రానా దగ్గుబాటి పాత్రను చూపించలేదు. అంతకు ముందు ఇది మల్టీస్టారర్ అని కూడా ఎక్కడా ప్రకటించనూ లేదు. మరి దీని వెనుక అసలు సంగతేంటి? అంటే విస్తుపోయే నిజాలే తెలుస్తున్నాయి.
మలయాళం వెర్షన్ కథను పవన్ ఇమేజ్ కి తగ్గట్టు పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. పవన్ వన్ మ్యాన్ షోలా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. స్క్రిప్ట్ మొత్తం మార్చింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కావడంతో రానా పాత్ర పరిధి కుదించేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఫక్తు పవన్ షో గానే కడకంటా సాగుతుందని కథనాలు వేడెక్కిస్తున్నాయి.
స్క్రిప్టు పరంగా పూర్తిగా వాణిజ్య అంశాలను కూర్చి మార్పులన్నింటిని చేసినట్లు చెబుతున్నారు. తెలుగు ఆడియన్స్ దృష్ట్యా రెండు పాత్రల్ని బ్యాలెన్స్ చేయడం కష్టం ..పవన్ ని మరో హీరోతో బ్యాలెన్స్ డ్ గా ఊహించుకోవడం కూడా కష్టం. కాబట్టి రానా పాత్రను ఓవైపు హైలైట్ చేస్తూనే మరో వైపు పవన్ రోల్ ని పీక్స్ లో చూపించనున్నారని మాట్లాడుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రధమార్థం అంతా సాప్ట్ గా బ్యాలెన్స్ డ్ గా నడిచినా ద్వితియార్ధంలో మాత్రం భారీ మార్పులే చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.