పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదల కోసం పలు సినిమాలు ఎదురు చూస్తున్నట్లు భీమ్లా నాయక్ సినిమా కూడా విడుదల కోసం వెయిటింగ్ లో ఉంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా ను త్వరలో విడుదల చేస్తాం అంటూ రెండు విడుదల తేదీలను చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఫిబ్రవరి 25 మరియు ఏప్రిల్ 1 తేదీల్లో ఎప్పుడైనా రావచ్చు అన్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఇప్పుడు ఆ రెండు తేదీల్లో ఏ తేదీకి పవన్ వస్తాడో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.
మరో వారం పది రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుండి టికెట్ల రేట్ల విషయంలో ఏదో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వరుసగా మీటింగ్ లు నిర్వహిస్తూ నివేదిక తయారు చేసే పనిలో ఉంది. టికెట్ల రేట్లు భారీగా కాకున్నా ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే కాస్త ఎక్కువగానే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే టికెట్ల రేట్లు పెంచిన వెంటనే భీమ్లా నాయక్ సినిమా ను విడుదల చేసేందుకు నిర్మాతలు కాచుకు కూర్చున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. టికెట్ల రేట్లు పెంచడంతో పాటు.. ఏపీ మరియు తెలంగాణ లో కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగిపోయినట్లయితే ఫిబ్రవరి 25న విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. అంటే భీమ్లా నాయక్ విడుదల తేదీ విషయంలో మరో వారం పది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.
మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా రూపొందిన భీమ్లా నాయక్ ను తెలుగు ప్రేక్షకుల కోసం చాలా మార్చారట. ఒరిజినల్ వర్షన్ కు త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేసి మరీ స్క్రీన్ ప్లే రాశారని తెలుస్తోంది. ఈ సినిమా కు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ అందించడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా ను నాగ వంశీ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో నిర్మించడం జరిగింది. ఈ సినిమా లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించింది. పవన్ మరియు నిత్యా మీనన్ లు కలిసి మొదటి సారి జతగా అది కూడా ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు సినిమా స్థాయిని పెంచేశాయి. థమన్ బీజీ తో కూడా భీమ్లా నాయక్ రేంజ్ ను పెంచాడు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల అయితే అభిమానులకు పండుగ ముందే వచ్చేసినట్లే. మరి పవన్ వచ్చేది ఎప్పుడో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.