దుబాయ్‌ లో యోగా క్లాసులతో కాలక్షేపం

Update: 2015-08-07 16:10 GMT
భూమికా చావ్లా అనే పేరును తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. సింహాద్రి లో తనకోసమే జీవితం అనుకునే ఎన్టీఆర్‌ నే వెన్నుపోటు పొడిచేస్తుంది. అసాధారణమైన ఫీట్‌ అది. ఆ దృశ్యం తెలుగు ప్రేక్షకుల కళ్లను వీడి ఎటూ వెళ్లదు. యువకుడు సినిమాలో జయసుధ-సుమంత్‌ లతో కలిసి ఈ భామ చిలిపి ఆగడాల్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు.

అంతేనా పవన్‌ సరసన ఖుషీ సినిమాలో భూమిక నటించిన తీరు ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. ఆ బొడ్డు సన్నివేశం యువతరానికి జ్వరం రప్పించిందంటే అతిశయోక్తి కాదు. మిస్సమ్మగా, అనసూయగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే నిలిచి ఉంది. అయితే అంతటి క్రేజు ఉన్న భూమిక ఉన్నట్టుండి తెలుగు సినిమాని వదిలిపెట్టేసి ఎటో వెళ్లిపోయిందేమిటో? అన్న సందేహం అభిమానుల గుండెల్లో అలానే ఉండిపోయింది.

భరత్‌ ఠాకూర్‌తో వివాహం, అటుపై సొంత వ్యాపారాలు దెబ్బ తినడం (ఫిలింమ్యాగజైన్‌ ఫెయిల్యూర్‌, సినిమా నిర్మాణం ఫ్లాప్‌) వంటి విషయాలన్నీ భూమికను పూర్తిగా నైరాశ్యంలోకి లాగేశాయని చెబుతారు. అందుకే ఇప్పుడు సైలెంటుగా దుబాయ్‌ లో సెటిలైంది. అక్కడే యోగా పాఠాలు చెప్పుకుంటూ తనకంటూ ఓ లైఫ్‌ ని సెట్‌ చేసుకుంది. ఇదిగో నిన్న, ఈరోజు జరుగుతున్న సైమా అవార్డుల ఉత్సవాల్లో పాల్గొని మరోసారి చర్చకు తెరలేపింది.
Tags:    

Similar News