ఇటీవల బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. హిస్టారికల్ కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు తీస్తున్నారు. ఇక దేశభక్తి నేపథ్యం లో ఆర్మీ.. నేవీ.. వాయు సేన అధికారుల జీవితకథలతో సినిమాల్ని తీస్తూ వేడెక్కిస్తున్నారు. `బుజ్- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` ఈ తరహానే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. పోస్టర్ లో అజయ్ దేవగన్ ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు.
ఈ చిత్రానికి అభిషేక్ దూదయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని న్యూ ఇయర్ సందర్భం గా దర్శకుడే స్వయంగా రివీల్ చేశాడు. ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశానికి అంకితమిస్తున్నామని అతడు ప్రకటించారు. ఇందులో దేవగన్ ఈ చిత్రంలో భారతీయ వాయుసేన పైలెట్ గా కనిపించనున్నాడు. ``అజయ్ సర్.. ఎస్.క్యూ. ఎల్.డి విజయ్ కర్ణిక్ అనే వైమానిక దళ అధికారి. ఆయన పోస్టర్ ని రిలీజ్ చేయడం ఎంతో ఆనందం గా గర్వంగా ఉంది`` అని దర్శకుడు అన్నారు.
బుజ్.. 1971 ఇండో పాకిస్తాన్ వార్ పై తెరకెక్కుతున్న హిస్టారికల్ చిత్రం. ఎస్.క్యూ.ఎల్.డి అంటే స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణిక్ అని అర్థం. బుజ్ ఎయిర్ బేస్ లో పని చేసిన అధికారి ఆయన. ఇందులో సోనాక్షి సిన్హా కథానాయిక. దేవగన్ ప్రస్తుతం తానాజీ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఆ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. తదుపరి బుజ్ చిత్రీకరణలోనూ దేవగన్ పాల్గొననున్నారు.