వీడియో: యువ నాయిక‌తో కుర్ర‌హీరో స‌ర‌సం

Update: 2022-06-16 02:30 GMT
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ స్పీడ్  గురించి తెలిసిందే. ఇప్పుడు అత‌డు మ‌లైకాతో కాకుండా భూమి పెడ్నేకర్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్ల‌డం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరూ కాస్త అలా ఒంట‌రి ప్ర‌దేశంలో తుంట‌రి ఫోజుల‌తో క‌నిపించ‌డం నెటిజ‌నుల్లో ర‌క‌ర‌కాల సందేహాల‌కు కార‌ణ‌మైంది. కుర్ర‌హీరో యువ‌నాయిక‌తో అలా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడేమిటో..! మ‌రీ అలా త‌న‌ని హ‌గ్ చేసుకుని గాల్లోకి ఎత్తేస్తున్నాడు? అంటూ నెటిజ‌నుల్లో సందేహం రాజుకుంది. భూమితో ఆ ప‌నులేంటి? మ‌లైకాకు చెబుతాం!! అని కూడా వార్నింగ్ ఇచ్చారు మ‌రి. అయితే ఈ కొంటె ప‌నుల వెన‌క అస‌లు కార‌ణం వేరే ఉంది.

నిజానికి ఇది ఆఫ్ ద స్క్రీన్ వ్య‌వ‌హారం కాదు. ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసే రొమాంటిక్ సీన్ కోస‌మేన‌ని తెలిసింది. ప్ర‌స్తుతం అర్జున్ - భూమి జంట `ది లేడీ కిల్లర్` అనే సినిమాలో న‌టిస్తున్నారు.  ఈ సినిమా ఓ స్మాల్ టౌన్ లో ప్లేబోయ్ గా క‌నిపించే కుర్రాడి క‌థ‌తో తెర‌కెక్కుతోంది. సుడిగాలి ప్రేమ‌క‌థ‌ల్లో స‌ద‌రు కుర్రాడు చాలా రొమాన్స్ పండిస్తాడ‌ట‌. ఇప్పుడు `సెల్ఫ్ డిస్ట్రాక్టివ్ బ్యూటీ`తో ప్రేమలో పడ్డాడు.

అర్జున్ కపూర్ లేడీకిల్లర్ తో డేట్ చేసే స‌న్నివేశం ఎలా ఉంటుందో చిత్రీక‌రిస్తున్నారు. సహనటి భూమి పెడ్నేకర్ కలిసి కొన్ని శృంగార స‌న్నివేశాల్లో క‌నిపించాల్సి ఉంటుంద‌ట‌. అలా ఈ జంట పార్క్ లో రొమాన్స్ కి రెడీ అయ్యారు. ఒంట‌రి ప్ర‌దేశంలో రొమాన్స్ కి రెడీ అయ్యారు. అక్క‌డే ఓచోట‌ గడ్డి మీద హాయిగా కూర్చోవడానికి ప్రయత్నించారు. ప్లేబోయ్ అర్జున్ ఏదోలా భూమికి బూటకపు మాటలు చెప్పి తన చేతుల్లోకి ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ భూమి నవ్వుతూ ఇది స‌రికాదేమో అన్న‌ట్టుగా చూస్తోంది. ప్ర‌స్తుతం ఈ జంట ఫోటోలు వీడియోలను చూసిన తర్వాత నెటిజనులు ఎవ‌రికి వారు ఊహాగానాల్లో తేలిపోయారు.

అర్జున్ ప్రియురాలు మలైకాకు ఫిర్యాదు చేస్తామ‌ని కూడా వార్నింగులు ఇస్తున్నారు. ఇంత‌కీ అర్జున్ ఏం చేయాల‌నుకుంటున్నాడు? అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకోవాల‌ని అనుకుంటున్నాడా? ప‌రాయి అమ్మాయితో ఏమిటీ రొమాన్స్ అని ప్ర‌శ్నిస్తున్నారు. ``45 రోజుల షూటింగ్ తర్వాత లేడీ కిల్లర్ తో కొన్ని కిల్లర్ లుక్స్ కోసం విఫలయ‌త్నం చేస్తున్నాడ‌ట‌. కొంద‌రికి అయినా షేర్ చేయండి!`` అంటూ అర్జున్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి నెటిజ‌నుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది. వెంట‌నే అత‌డికి కౌంట‌ర్లు ప‌డిపోతున్నాయ్. ఇంత‌కీ మలైకాకు మీ గుండెల్లో ఉన్న‌ స్థానం ఏమిటో? అని కూడా ఒకరు ప్ర‌శ్నించారు.

నేను మలైకా అయితే  చాలా అసూయ ప‌డతాను అని కూడా ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.``మామ్ మలైకా అరోరా.. అర్జున్ సర్ సభీ వీడియో యా పిక్ పిఆర్ లైక్ యా కామెంట్ జుర్ కృతి థీ .. ఇస్మే కుచ్ న్హీ`` అని పిక్ పై స్పందించారు వేరొక నెటిజ‌న్. అర్జున్ త‌న‌ ఇంటికి తిరిగి రాగానే అతని సంగ‌తిని మ‌లైకా చూస్కుంటుంది అని కూడా కామెంట్ చేసారు కొంద‌రు. భాయ్ మలైకా దేఖేగీ తో తుమ్హారీ ఖైర్ నహిన్ అని ఒక నెటిజ‌నుడు వ్యాఖ్యానించాడు.``మలైకా మామ్ సోచ్ రహీ కి బేటా తు ఘర్ ఆహ్ ఫిర్ మైన్ తుజే దేఖ్తీ హు`` అని చమత్కరించారు. మొత్తానికి `ది లేడీ కిల్లర్`కి కావాల్సినంత ప్ర‌మోష‌న్ ద‌క్కుతోంది. గ‌తంలో బిఎ పాస్ -సెక్షన్ 375 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ బహ్ల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా.. భూషణ్ కుమార్ - శైలేష్ ఆర్ సింగ్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 2022 లో అర్జున్ కపూర్ లైనప్ చాలా వైవిధ్యంగా  ఆసక్తికరంగా కనిపిస్తోంది. `ఏక్ విలన్ 2` లాంటి ఎంటర్ టైనర్ లో తన కండలను ప్రదర్శిస్తూ భీక‌రంగా క‌నిపించ‌నున్నాడు. ది లేడీకిల్లర్ లో రోమియోగా అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. `కుట్టే`లో కూడా తన విల‌క్ష‌ణ నటనను ప్రదర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. మ‌రోవైపు భూమికి చ‌క్క‌ని ఆఫర్లు ఉన్నాయి. అనుభవ్ సిన్హా `భీద్- శశాంక్ ఖైతాన్ `గోవిందా ఆలా రే`.. అక్షయ్ కుమార్ - ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేష‌న్ లో `రక్షా బంధన్` చిత్రాల్లో న‌టిస్తోంది. త్వరలో ప్రకటించనున్న ప‌లు ప్రాజెక్ట్ ల త‌న‌కు ఉన్నాయి.


Tags:    

Similar News