సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన పిచ్చైక్కారన్ తమిళంలో హిట్ అయిన విషయం, అనువాద చిత్రంగా తెలుగులో అంతకు మించి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ద్వారా కథానాయకిగా పరిచయం అయిన భామ సాట్నాటైటస్. తెలుగులో బిచ్చగాడు గా వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నెలకొల్పిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో "నేనో తింగరబుచ్చీ" అంటూ పాట పాడి బిచ్చగాడిని ప్రేమించిన హీరోయిన్ సాట్నా టైటస్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే విషయం తాగాజా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తన కూతురుని మోసం చేశారని, మాయమాటలు చెప్పి నమ్మించారని ఆమె తల్లి నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.
ఈ సినిమా అనంతరం ఫుల్ ఆఫర్స్ సంపాదించుకునే పనిలో ఉంటుందిలే అనుకున్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది సాట్నా టైటస్. ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేసిన బయ్యర్లలో ఒకరైన కార్తి ని సాట్నా రహస్య వివాహం చేసుకుందట. ఈ మేరకు నెల రోజుల క్రితమే ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో ఈ పెళ్లి, సాట్నా తల్లికి ఏమాత్రం ఇష్టం లేదట. తన కూతురిని అతడు మాయలో పడేశాడని.. కార్తి నుంచి సాట్నాను విడిపించాలని నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న బయ్యర్ కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని, త్వరలో బహిరంగంగా మళ్లీ పెళ్లి చేసుకుంటామని చెప్పారు. పెళ్లి తర్వాత సాట్నా తన నటనకు స్వస్తి చెప్పనున్నారని చెప్పారు. దీంతో సాట్నా ఇప్పటికే అంగీకరించిన "తిట్టం పోట్టు తిరుడర కూట్టం" సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్.