కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న మొదలైన విషయం తెలిసిందే. అన్ని సీజన్ ల తరహాలోనే ఈ సీజన్ ప్రారంభం నుంచి విమర్శలు, వివాదాలు మొదలయ్యాయి. సీపీఐ నారాయణ ఈ షో పై వివాదాస్ప వ్యాఖ్యలు చేయడమే కాకుండా హోస్ట్ నాగార్జునపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ ఒకడ్రామా అనడమే కాకుండా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ని ఉపయోగించి సీపీఐ నారాయణ సంచలనం సృష్టించారు.
ఇదిలా వుంటే తాజాగా ఈ షోపై ఏపీ హైకోర్టు మండిపడింది. ఈ షోని నిర్వహిస్తున్న హోస్ట్ నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్ షోపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతకు ముందు విచారణలో భాగంగా బిగ్ బాస్ షోపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై స్పందించిన హై కోర్ట్ రెండు లేదా మూడు ఎపిసోడ్ లని పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణని రెండు వారాల పాటు వాయిదా వేసింది. 2019లోనూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. రెండు దఫాలుగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపి అసలు షోలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఎలాంటి సెన్సార్ షిప్ లేకుండా బిగ్ బాస్ షో ప్రదర్శించబడుతున్న కారణంగా ఈ షోని నిలిపి వేయాలని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్త మవుతున్న నేపథ్యంలో షో నిర్వాహకులతో పాటు నాగార్జున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.