బిగ్‌బాస్5 : జెస్సీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..!

Update: 2021-11-17 12:30 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి అనూహ్యంగా అనారోగ్య కారణంతో ఎలిమినేట్ అయిన జెస్సీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగైందని తెలుస్తోంది. హైదరాబాద్ లోని కాచీగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో జెస్సీ చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన కళ్లు మసక అవ్వడంతో పాటు తల అంతా కూడా భారం అవ్వడం ఇంకా కొన్ని ఇతర సమస్యలతో బాధ పడుతున్నారు. ఆయనకు గతంలో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయట. ఇప్పుడు బిగ్ బాస్ లో అవి ఎక్కువ అయినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. బిగ్‌ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత జెస్సీ ఆరోగ్యం గురించి ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఒక మీడియా సంస్థతో ఆసుపత్రి నుండే మాట్లాడుతూ తాను కోలుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

బిగ్‌ బాస్ నుండి బయటకు వెళ్లిన వెంటనే అరియానాతో బిగ్‌ బాస్ బజ్ లో పాల్గొన్న జెస్సీ అక్కడ చాలా యాక్టివ్‌ గా కనిపించాడు. కాని అప్పుడు కూడా అతడు తీవ్ర తలనొప్పి మరియు కళ్లు మసకలతో బాధ పడుతున్నాడట. ఆ షో లో అరియానాకు ఐ లవ్‌ యూ చెప్పడంతో పాటు చాలా చాలా పంచ్ లు వేసి ఆమెను ఫ్లట్ చేయడం కూడా చేశాడు. అతడి మాట తీరు చూసి నీలో మన్మధుడు దాగి ఉన్నాడు అని కూడా అరియానా అన్నది. కెమెరా ముందు జెస్సీ బాగానే ఉన్నా కూడా అతడు చాలా సమస్యను పెయిన్‌ ను ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో జాయిన్‌ అయిన తర్వాత కాస్త రిలాక్స్‌ అయ్యాడని.. తర్వలోనే అతడు పూర్తిగా నార్మల్‌ అవుతాడని వైధ్యులు చెబుతున్నారు.

బిగ్‌ బాస్ ఫినాలే ఎపిసోడ్‌ కు ఖచ్చితంగా జెస్సీ పూర్తి ఆరోగ్యంతో వెళ్తాడని సన్నిహితులు చెబుతున్నారు. బిగ్‌ బాస్‌ లో జెస్సీ ఉన్న సమయంలో కొన్ని సార్లు ప్రేక్షకులకు విసుగు తెప్పించినా ఎక్కువ సార్లు మాత్రం ఆయన పద్దతి నచ్చింది. ముఖ్యంగా సిరి మరియు షన్నూ తో స్నేహం మరియు అమ్మాయిలతో అతడు సన్నిహితం గా ఉండటం ఇలా పలు విషయాల్లో జెస్సీ బెటర్‌ అన్నట్లుగా టాక్ దక్కించుకున్నాడు. అందుకే జెస్సీ వెళ్లిన సమయంలో ప్రేక్షకులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. జెస్సీ మరో రెండు మూడు వారాలు ఉండేందుకు అర్హత కలిగి ఉన్నాడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆనీ మాస్టర్‌.. ప్రియాంక కంటే ఖచ్చితంగా జెస్సీ స్ట్రాంగ్‌ అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News