ఓవర్సీస్ బయ్యర్లకు హ్యాండిచ్చిన బడా సంస్థ?

Update: 2019-04-26 11:53 GMT
కొన్ని వినడానికి విచిత్రంగా ఉన్నా పరిశ్రమలో జరిగేవి అలాగే ఉంటాయి. పైకి చాలా అందంగా కనిపించే ఓవర్సీస్ మార్కెట్ లో ఒక్కోసారి ఇక్కడి కన్నా ఎక్కువగా చిక్కులు సమస్యలు కనిపిస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. అమెరికాలో అదొక అగ్రగామి డిస్ట్రిబ్యూషన్ సంస్థ. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ హక్కులు ఇదే కొంది. స్థానిక డిస్ట్రిబ్యూటర్లు దీని హక్కులను మంచి ధరకే తీసుకున్నారు. యుఎస్ అంతా భారీగా విడుదల చేసారు.

హిట్ అయితే చాలు అనుకునే అది ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు కొట్టేసింది. రుపాయకి రెండు రూపాయల లాభం. కాని వినేంత సంబరంగా అక్కడ సిచ్యువేషన్ లేదు. స్థానిక బయ్యర్లకు రావాల్సిన బకాయిని ఇంకా సదరు సంస్థ చెల్లించనే లేదు. అడిగితే ఇదుగో అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప డబ్బు సంగతి మాత్రం లేదు. ఇది జరిగి నాలుగు నెలలు అవుతోంది. ఇంతవరకు ఎలాంటి సెటిల్ మెంట్ జరగలేదు.

ఆ బ్లాక్ బస్టర్ లో వచ్చిన సొమ్మును లాభాలను తీసుకుని ఇటీవలే రిలీజైన మరో సినిమాకు పెట్టేశారు. ఇది దానంత అద్భుతాలు చేయకపోవడంతో లెక్క తప్పింది. పాత బాకీలను ఇది సూపర్ హిట్ అయితే ఇచ్చేద్దాం అనుకున్న సదరు అగ్ర సంస్థకు షాక్ తగిలింది. దానికి తోడు అవెంజర్స్ దెబ్బకు ఇప్పుడు డీసెంట్ రన్ లో ఉన్న కొత్త సినిమా వాష్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు స్థానిక బయ్యర్లు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చినా అవి తమ చేతికి రాలేదని లబోదిబోమంటున్నారు. ఇదండీ అప్పుడప్పుడు మేడిపండులా మారిపోయే అమెరికా బాక్స్ ఆఫీస్ కథ.
   


Tags:    

Similar News