కరోనా సమయంలో నెలలకు నెలలు థియేటర్లు మూత పడి ఉండటం.. తెరిచిన తర్వాత కూడా జనాలు కరోనా భయంతో థియేటర్లకు వెళ్లక పోవడం.. గత రెండేళ్ల కాలంగా పెద్ద సినిమాలను ధైర్యంగా విడుదల చేయక పోవడం వంటి కారణాల వల్ల జనాలు ఓటీటీ బాట పట్టారు. 2020 కి ముందు తో పోల్చితే ఇప్పుడు ఇండియాలో ఓటీటీ ఖాతాదారుల సంఖ్య డబుల్ అయ్యింది అనడంలో సందేహం లేదు. అందుకే పెద్ద ఎత్తున ఓటీటీ లు భారీ సినిమాలను విడుదలకు సిద్దం అవుతున్నాయి.
ఒకప్పుడు ఓటీటీ లో థియేటర్ రిలీజ్ అయిన తర్వాత కనీసం 50 రోజుల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ అయ్యేవి. కాని ఇప్పుడు మూడవ వారం లేదా నాల్గవ వారం తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. కొన్ని పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. తెలుగు స్టార్ హీరోలకు చెందిన పలు సినిమాలు డైరెక్ట్ ఓటీటీకి విడుదల అయిన విషయం తెల్సిందే. కొన్ని పెద్ద హీరోల సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యాయి.
రాబోయే రెండు మూడు వారాల్లో భారీ ఎత్తున సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా కొన్ని ఇప్పటికే థియేటర్ రిలీజ్ అయ్యాయి. డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికి వెళ్తే మొదటగా దుల్కర్ సల్మాన్ నటించిన 'సెల్యూట్' సినిమా. ఈ సినిమా ను సోనీ లివ్ వారు ఈ నెల 18వ తారీకున భారీ ఎత్తున స్ట్రీమింగ్ చేసేందుకు గాను ప్రమోషన్ ను మొదలు పెట్టింది.
సెల్యూట్ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు ఇతర సౌత్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా సోనీలివ్ నుండి సమాచారం అందుతోంది. దుల్కర్ సల్మాన్ కు ఉన్న స్టార్ డమ్ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవ్వాల్సిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కురూప్ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా భారీ వసూళ్లను నమోదు చేసేది అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
సెల్యూట్ కాకుండా తెలుగు స్టార్ హీరో నటించిన రవితేజ ఖిలాడి సినిమా ను పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఖిలాడి సినిమాను ఈ వారంలోనే అంటే మార్చి 11వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇటీవలే ఖిలాడి విడుదల అయ్యి థియేటర్లలో ఆకట్టుకోలేక పోయింది. కాని రవితేజ అభిమానులు మాత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు.
ఇక ధనుష్ నటించిన మారన్ సినిమా ను కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అదే మార్చి 11వ తారీకున మారన్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన క్లాప్ సినిమా ను ఈనెల 11న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సినిమా లను పోస్ట్ రిలీజ్ స్ట్రీమింగ్ కు కూడా సిద్దం చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం మరియు వచ్చే వారం ఓటీటీ ప్రేక్షకులకు సినిమాల జాతర అంటూ ఓటీటీ విశ్లేషకులు చెబుతున్నారు.